Sundeep Kishan : సందీప్ కిషన్ త్వరలో ‘ఊరుపేరు భైరవకోన'(Ooru Peru Bhairavakona)అనే థ్రిల్లర్ సినిమాతో రాబోతున్నాడు. VI ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 16న రిలీజ్ కానుంది. ప్రస్తుతం మూవీ యూనిట్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. తాజాగా నేడు ఈ మూవీ యూనిట్ మీడియాతో ముచ్చటించగా మీడియా అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
ఓ మీడియా ప్రతినిధి సందీప్ కిషన్ ని.. మా నగరం సినిమాతో లోకేష్ కనగరాజ్(Lokesh Kanagaraj) ని మీరే పరిచయం చేశారు. అతనితో మళ్ళీ ఏమైనా సినిమా చేస్తారా? లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో ఏమైనా చేస్తారా అని అడగగా సందీప్ కిషన్ సమాధానమిస్తూ.. మేమిద్దరం ఇప్పటికీ క్లోజ్. రెగ్యులర్ గా మాట్లాడుకుంటాం. నన్ను ఆల్రెడీ LCU లో ఒక క్యారెక్టర్ చేయమని లోకేష్ అడిగాడు. కానీ అతను చెప్పిన క్యారెక్టర్ నాకు అంతగా నచ్చలేదు. అతని దర్శకత్వంలో నేను చేయాలంటే ఆ క్యారెక్టర్ చాలా బాగుండాలి అనిపించింది. అందుకే లోకేష్ అడిగినా చేయలేదు. నేను పరిచయం చేసిన డైరెక్టర్ ఇంత ఎదిగినందుకు సంతోషిస్తున్నాను అని తెలిపాడు.
Also Read : Samantha : కొత్త వర్క్ మొదలుపెడుతున్న సమంత.. మీకోసం హెల్త్ అంటూ ఆ రూపంలో..
తమిళ్ లో స్టార్ డైరెక్టర్ గా ఎదిగిన లోకేష్ కనగరాజ్ మొదటి సినిమా సందీప్ కిషన్ తో ‘మా నగరం’ తీసాడు. ఈ సినిమా పర్వాలేదనిపించింది. అప్పట్నుంచి లోకేష్ – సందీప్ మధ్య స్నేహం ఉంది. ఇటీవల సందీప్ మైఖేల్ సినిమాని తమిళ్ లో లోకేష్ విడుదల చేసాడు. మరి LCU లో భవిష్యత్తులో అయినా సందీప్ కిషన్ ఓ పాత్ర చేస్తాడేమో చూడాలి.