Sundeep Kishan : శంబాలా నిర్మాతలతో సందీప్ కిషన్ భారీ పాన్ ఇండియా సినిమా..

నేడు ఈ సినిమాని ప్రకటిస్తూ క్రేజీ కాన్సెప్ట్ పోస్టర్‌ను రిలీజ్ చేసారు. (Sundeep Kishan)

  • Published On : March 21, 2026 / 02:45 PM IST

Sundeep Kishan

Sundeep Kishan : ఇటీవల ఆది సాయి కుమార్ శంబాల సినిమాతో భారీ ఇట్ కొట్టాడు. డైరెక్టర్ యుగంధర్ ముని దర్శకత్వంలో నిర్మాతలు మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు ఈ సినిమాని నిర్మించారు. ఇప్పుడు ఇదే కాంబోలో మరో సినిమా రానుంది. శంబాల ఇదే దర్శక, నిర్మాతలు కలిసి నేడు సందీప్ కిషన్‌తో భారీ పాన్ ఇండియా సోషియో ఫాంటసీ సినిమాని ప్రకటించారు.

నేడు ఈ సినిమాని ప్రకటిస్తూ క్రేజీ కాన్సెప్ట్ పోస్టర్‌ను రిలీజ్ చేసారు. ఈ పోస్టర్ లో ఒక సింహం, తోడేలు మధ్యలో ఒక పురాతన ఖడ్గం ప్రకాశిస్తూ ఉంది. కొన్ని యుద్ధాలు ఎప్పటికీ ముగియవు. కొంతమంది రాజులు ఎప్పటికీ మరణించరు అనే క్యాప్షన్ తో ఉంది. దీంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి.

Also See : Deepthi Sunaina : ఎరుపు చీరలో దీప్తి సునైనా అందాల మెరుపులు..

శంబాలాని మించి ఈ సినిమాని తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నారు దర్శక నిర్మాతలు. ప్రొడక్షన్ డిజైన్, విజువల్ ఎఫెక్ట్స్, కథనం విషయంలో భారీగా ప్లాన్ చేస్తున్నారు. సోషియో ఫాంటసీ డ్రామాగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఆగస్టు 2026లో షూటింగ్ మొదలవుతుందని నిర్మాతలు ప్రకటించారు.

Also See : Allu Sneha Reddy : కూతురు అర్హతో అల్లు స్నేహరెడ్డి.. చీరకట్టులో లేటెస్ట్ ఫొటోలు..