Sundeep Kishan : ‘ధమాకా’ డైరెక్టర్‌తో అల్లరి చేయబోతున్న సందీప్ కిషన్..

రవితేజకు ధమాకా లాంటి బ్లాక్ బస్టర్ 100 కోట్ల హిట్ ఇచ్చిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో సందీప్ కిషన్ సినిమా చేయబోతున్నాడు.

Sundeep Kishan Paired up with Trinadh Rao Nakkina for his 30th Movie

Sundeep Kishan : సందీప్ కిషన్ ఇటీవలే ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాతో వచ్చి మంచి విజయం సాధించాడు. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా అప్పుడప్పుడు సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం ధనుష్ సినిమాలో సందీప్ కిషన్ ఓ ముఖ్య పాత్ర చేయబోతున్నాడు. తాజాగా తన నెక్స్ట్ సినిమాని ప్రకటించాడు.

రవితేజకు ధమాకా లాంటి బ్లాక్ బస్టర్ 100 కోట్ల హిట్ ఇచ్చిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన(Trinadh Rao Nakkina) దర్శకత్వంలో సందీప్ కిషన్ సినిమా చేయబోతున్నాడు. #SK30 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాని ప్రకటించారు చిత్రయూనిట్. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అందరూ హిట్స్ తో ఉన్నవాళ్లు కలిసి ఈ సినిమాని చేస్తున్నారు. దీంతో ఈ సినిమా కూడా హిట్ కొడుతుందని భావిస్తున్నారు.

Also Read : Anushka Shetty : ఇండస్ట్రీకి వచ్చిన 19 ఏళ్ళ తర్వాత అక్కడ ఎంట్రీ ఇస్తున్న అనుష్క.. సన్నబడింది సినిమా కోసమేనా?

ఇక ఈ సినిమాకి ధమాకాకు కథ అందించిన ప్రసన్న కుమార్ బెజవాడ కథని అందించాడు. ఇది కూడా కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని సమాచారం. వరుస ఫ్లాప్స్ లో ఉన్న సందీప్ కిషన్ ఊరుపేరు భైరవకోన సినిమాతో సక్సెస్ లోకి వచ్చాడు. ఈ సినిమాతో అదే సక్సెస్ ని కంటిన్యూ చేస్తాడేమో చూడాలి.

ట్రెండింగ్ వార్తలు