Power Peta: మెగాస్టార్ ఫ్యాన్ బాయ్‌గా సందీప్ కిషన్.. ‘పవర్‌పేట’లో మాస్ హంగామా
అలనాటి మెగాస్టార్ క్రేజ్ ను తెరపై ఆవిష్కరించబోతున్న పవర్ పేట(Power Peta) మూవీ టీం.
- V Santhosh Kumar
- Published on- May 3, 2026 / 09:59 AM IST
Sundeep Kishan seen as Chiranjeevi fan in Power Peta movie
- ‘పవర్‌పేట’లో మెగా అభిమానిగా సందీప్.
- 90ల నాటి రాజకీయ యాక్షన్ కథ.
- కృష్ణ చైతన్య దర్శకత్వంలో క్రేజీ మూవీ.
Power Peta: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ ఎప్పుడూ వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ వంటి మాస్ హిట్ అందించిన దర్శకుడు కృష్ణ చైతన్య దర్శకత్వంలో సందీప్ కిషన్ ఇప్పుడు ‘పవర్‌పేట(Power Peta)’ అనే భారీ ప్రాజెక్టును పట్టాలెక్కిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో సందీప్ కిషన్ పోషిస్తున్న పాత్రకు సంబంధించి ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ తాజాగా బయటకు వచ్చి మెగా అభిమానుల్లో జోష్ నింపింది.
Kalki 2: కల్కి 2లో ప్రభాస్ తో శింబు.. ఏ పాత్ర చేస్తున్నాడో తెలిస్తే షాకవుతారు!
ఈ సినిమాలో సందీప్ కిషన్ మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమానిగా కనిపించబోతున్నారు. 90వ దశకం నేపథ్యంలో సాగే ఈ కథలో, అప్పటి మెగాస్టార్ క్రేజ్‌ను ప్రతిబింబించేలా సందీప్ పాత్రను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. 1990ల నాటి రాజకీయాలు, యాక్షన్ డ్రామా కలబోతగా ఈ చిత్రం రూపొందుతోంది. ఆ కాలం నాటి చిరంజీవి గారి సినిమాల సందడి, ఫ్యాన్స్ చేసే హంగామా వంటి ఎలిమెంట్స్ సినిమాలో హైలైట్‌గా నిలుస్తాయని చిత్ర యూనిట్ భావిస్తోంది.
రాజకీయ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ డ్రామాలో సందీప్ కిషన్ మునుపెన్నడూ చూడని కొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. దర్శకుడు కృష్ణ చైతన్య తనదైన శైలిలో ఈ పీరియడ్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. మెగాస్టార్ ఫ్యాన్ బాయ్‌గా సందీప్ కిషన్ చేసే సందడి థియేటర్లలో ప్రేక్షకులకు పాత జ్ఞాపకాలను గుర్తు చేయడం ఖాయం అంటున్నారు మేకర్స్. బలమైన కథ, కథనాలతో పాటు మెగా టచ్ కూడా తోడవడంతో ‘పవర్‌పేట’ సినిమా సందీప్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలే షూటింగ్ మొదలైన ఈ సినిమా 2026 ఎండింగ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
