Kalki 2: కల్కి 2లో ప్రభాస్ తో శింబు.. ఏ పాత్ర చేస్తున్నాడో తెలిస్తే షాకవుతారు!
ప్రభాస్ కల్కి 2 (Kalki 2)సినిమాలో కీలక పాత్ర చేయనున్న తమిళ స్టార్ శింబు.
silambarasan tr doing a special role in prabhas kalki 2
- ‘కల్కి 2’ సెట్స్‌లోకి స్టార్ శింబు.
- క్లైమాక్స్‌లో శింబు కీలక పాత్ర.
- ప్రభాస్ లేకుండానే మొదలైన షూటింగ్.
Kalki 2; నాగ్ అశ్విన్ దర్శకత్వంలో గ్లోబల్ హిట్ సాధించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రానికి సీక్వెల్‌గా రాబోతున్న ‘కల్కి 2(Kalki 2)’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ భారీ సీక్వెల్ పై అంచనాలు కూడా అదే రేంజ్ లో పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ షరవేగంగా సాగుతోంది. విశేషమేమిటంటే, హీరో ప్రభాస్ ఇంకా సెట్స్‌లోకి రాకముందే, దర్శకుడు నాగ్ అశ్విన్ లెజెండరీ నటులు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్‌లతో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మొదటి భాగం ముగిసిన చోటు నుండే ఈ సీక్వెల్ అత్యంత ఆసక్తికరంగా ప్రారంభం కానుందని తెలుస్తోంది.
Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’కి థియేటర్ల సెగ.. కలెక్షన్ల మీద పెద్ద దెబ్బ.. ఆందోళనలో మెగా ఫ్యాన్స్
ఈ పాన్-ఇండియా ప్రాజెక్టులో ఇప్పటికే ప్రభాస్, దీపికా పాడుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజాలతో పాటు దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ వంటి స్టార్స్ భాగమయ్యారు. ఇప్పుడు ఈ మెగా లిస్టులోకి తమిళ స్టార్ హీరో శింబు కూడా చేరడం విశేషం. శింబు ఈ చిత్రంలో ఒక ప్రత్యేక అతిథి పాత్రలో మెరవబోతున్నారని, ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ఒక కీలక సన్నివేశంలో ఆయన పాత్ర ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటుందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.
శింబు పోషించబోయే ఆ పాత్ర పురాణాలకు సంబంధించిందా లేక భవిష్యత్తు కాలానికి చెందిన యోధుడిదా అనేది ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది. క్లైమాక్స్‌లో ఆయన ఎంట్రీ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కిస్తుందని చిత్ర బృందం భావిస్తోంది. వైజయంతీ మూవీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సీక్వెల్లో శింబు లాంటి టాలెంటెడ్ నటుడు చేరడం వల్ల అటు కోలీవుడ్‌లో కూడా ఈ సినిమాపై భారీ క్రేజ్ నెలకొంది. ఈ విభిన్న స్టార్ కాస్టింగ్ ‘కల్కి 2’ని ఇండియన్ సినిమాలోనే అతిపెద్ద మల్టీస్టారర్‌గా మార్చబోతోంది. ఇక కల్కి 2 సినిమా 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
