Peddi: రామ్ చరణ్ ‘పెద్ది’కి థియేటర్ల సెగ.. కలెక్షన్ల మీద పెద్ద దెబ్బ.. ఆందోళనలో మెగా ఫ్యాన్స్
ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్ల వివాదం సద్దుమనుగకపోతే ఆ ప్రభావం పెద్ది(Peddi) సినిమాపై పడే అవకాశం ఉంది.
Ram charan peddi facing theaters issue, producer cherry shocking comments
- ‘పెద్ది’ మూవీకి థియేటర్ల వివాదం సెగ.
- మే 8న కీలక చర్చల నిర్ణయం.
- కలెక్షన్లపై మెగా ఫ్యాన్స్ ఆందోళన.
Peddi: మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత చెర్రీ ఇటీవల ‘జెట్ లీ’ సినిమా విడుదల సందర్భంగా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల మధ్య తలెత్తిన వివాదాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. పర్సంటేజ్ మోడల్ విషయంలో ఆసియన్, ఎస్వీసీ గ్రూపులతో తలెత్తిన భేదాభిప్రాయాల వల్ల ‘జెట్ లీ’ ప్రదర్శనపై ప్రభావం పడిందని ఆయన పేర్కొన్నారు. ఇదే సమస్య రామ్ చరణ్ నటించిన భారీ చిత్రం ‘పెద్ది’పై కూడా పడే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేయడం ఇప్పుడు ఫిల్మ్ నగర్లో చర్చనీయాంశమైంది.
Peddi: ‘పెద్ది’ లాస్ట్ డే షూట్.. రామ్ చరణ్‌తో సినిమాటోగ్రాఫర్ రత్నవేలు స్పెషల్ ఫోటోలు
ఈ నేపథ్యంలోనే మే 8న ప్రొడ్యూసర్స్, ఎగ్జిబిటర్ల మధ్య జరగనున్న సమావేశం కీలకంగా మారనుంది. జూన్ 4న ‘పెద్ది(Peddi)’ ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కావాల్సి ఉంది. మెగా పవర్ స్టార్ సినిమా కావడంతో దీనికి భారీ ఓపెనింగ్స్ అత్యవసరం. ఒకవేళ మే 8న జరిగే సమావేశంలో ఈ సమస్య పరిష్కారం కాకపోతే, పెద్ది సినిమాకు థియేటర్ల కేటాయింపు, ప్రదర్శన విషయంలో చిక్కులు తప్పవు. ఇది నేరుగా సినిమా కలెక్షన్లపై దెబ్బ కొట్టే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ పరిణామాలతో మెగా అభిమానులు కొంత ఆందోళనకు గురవుతున్నారు. సినిమా అవుట్‌పుట్ అదిరిపోయిందని టాక్ వినిపిస్తున్న తరుణంలో, ఇలాంటి టెక్నికల్, బిజినెస్ ఇష్యూస్ సినిమా విజయాన్ని అడ్డుకోకూడదని వారు కోరుకుంటున్నారు. విడుదల సమయానికి వివాదాలన్నీ సర్దుమణిగి, ‘పెద్ది’ సజావుగా థియేటర్లలోకి వస్తుందని నిర్మాత చెర్రీ ధీమా వ్యక్తం చేసినప్పటికీ, ఆ కీలక సమావేశం ఫలితం ఎలా ఉంటుందనేది ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.
