Sunny Leone : భర్త మోసం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న నటి సన్నీలియోన్.. వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్
సన్నీ లియోన్ (Sunny Leone)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. భర్త తనను మోసం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు చెబుతూ తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది.
- Thota Vamshi Kumar
- Published On : July 14, 2023 / 08:00 PM IST
Daniel weber cheats Sunny Leone
Sunny Leone-Daniel weber : సన్నీ లియోన్ (Sunny Leone)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు శృంగార తారగా క్రేజ్ తెచ్చుకున్న అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్‌లో నటిగా రాణిస్తోంది. సినిమాలే కాకుండా వెబ్ సిరీస్‌లు, స్పెషల్ సాంగ్స్ కూడా చేస్తోంది. వీలు చిక్కినప్పుడల్లా తన కుటుంబంతో కలిసి సరదాగా వెకేషన్లకు వెలుతూ ఉంటుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులతో తన సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఉంటుంది.
ప్రస్తుతం సన్నీ లియోన్ తన భర్త డానియెల్ వెబెర్(Daniel weber), పిల్లలతో కలిసి దుబాయ్ వెకేషన్‌లో ఉంది. భర్త తనను మోసం చేస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు చెబుతూ తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఏముందంటే.. డానియెల్ వెబెర్ కిచెన్‌లో వెళ్లి ఏదో తింటుంటాడు. అతడి రిప్లెక్షన్‌ను అద్దంలో కనిపిస్తుండగా హాల్‌లో ఉన్న సన్నీ లియోన్ చూస్తుంది. ఏం చేస్తున్నావని అతడిని ప్రశ్నించగా నీళ్లు తాగుతున్నాను అంటూ సమాధానం చెప్పాడు.
Rashmika : బేబీ ప్రీమియర్.. హాజరైన విజయ్ దేవరకొండ, రష్మిక.. శ్రీవల్లి రియాక్షన్ ఇదే
అబద్దం చెప్పకు విండో అద్దంలో నీ ప్రతిబింబం కనిపిస్తోంది. నువ్వు ఐస్‌క్రీమ్ తింటున్నావు అని తెలుసు. మర్యాదగా ఐస్‌క్రీమ్ తీసుకుని వచ్చి ఇక్కడ కూర్చో అని సన్నీ అంటోంది. అప్పుడు అతడు ఐస్‌క్రీమ్ పట్టుకుని బయటకు వస్తాడు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది సన్నీ లియోన్. దీనికే నా భర్త నన్ను మోసం చేసినప్పుడు అనే క్యాప్షన్ ఇచ్చింది. దీనిపై నెటీజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.
Janhvi Kapoor : అమ్మ చనిపోయినప్పుడు.. పెద్ద యుద్ధమే చేశా : జాన్వీకపూర్
సన్నీ లియోన్ భారత మూలాలు ఉన్న అమెరికన్ నటి. 1981 మే 13 కెనడాలోని ఓ సిక్కు కుటుంబంలో జన్మించింది. 2012లో ‘జిస్మ్ 2 సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ‘కరెంట్ తీగ’ తెలుగు ప్రేక్షకుల్ని అలరించింది. పోర్న్ ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్‌లో నటి అయ్యే ప్రయాణంలో అనేక బెదిరింపులు, అడ్డకుంటు ఎదుర్కొన్నానని పలు సందర్భాల్లో సన్నీ చెప్పింది.
