గొప్ప దర్శకురాలు భార్య కావడం నా అదృష్టం – సూపర్‌స్టార్ కృష్ణ

విజయ నిర్మల విగ్రహావిష్కరణలో ఆమె గొప్పదనం గురించి తెలిపిన సూపర్‌స్టార్ కృష్ణ..

  • Publish Date - February 20, 2020 / 07:47 AM IST

విజయ నిర్మల విగ్రహావిష్కరణలో ఆమె గొప్పదనం గురించి తెలిపిన సూపర్‌స్టార్ కృష్ణ..

ప్రముఖ నటి, మహిళా దర్శకురాలు విజయనిర్మల 74 వ జయంతి సందర్భంగా నానక్ రామ్ గూడా కృష్ణ విజయ నిర్మల నివాసంలో సూపర్‌స్టార్ కృష్ణ ఆమె  విగ్రహాన్ని ఆవిష్కరించారు. 

ఈ కార్యక్రమంలో కృష్ణంరాజు, మురళీమోహన్, మహేష్ బాబు, నమ్రత, ఎస్వీ కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డి, గల్లా జయదేవ్, నిర్మాత పివిపి, పరుచూరి గోపాల కృష్ణ, ఆదిశేషగిరరావు, శివకృష్ణ, మారుతి, నందిని రెడ్డి బ్రహ్మాజీ, శివ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

‘‘విజయ నిర్మల 4,5 సినిమాలు యాక్టింగ్ చేసిన తర్వాత డైరెక్షన్ చేస్తానంది. నేను ఇప్పుడే వద్దు అని చెప్పాను. 100 సినిమాలు చేసిన తరువాత చెయ్యి అని చెప్పాను. అలాగే వంద సినిమాలు అయిన తరువాత తక్కువ బడ్జెట్‌లో మలయాళంలో సినిమా చేసింది.

ఆ తర్వాత తెలుగులో ‘మీనా’ చేసింది. రెండూ సూపర్ హిట్స్. ఆమె డైరెక్ట్ చేసిన సినిమాలు 95 శాతం హిట్సే.. ఏవో రెండు మూడు తప్ప అన్నీ విజయంతమైన సినిమాలే. విజయనిర్మల నా భార్య కావడం నా అదృష్టం. ఆమె మీద అభిమానంతో ఇక్కడకు వచ్చిన అందరికీ కృతజ్ఞతలు’’ అన్నారు కృష్ణ.