సూపర్‌స్టార్ స్టైలిష్ లుక్‌!

  • Publish Date - November 17, 2020 / 11:41 AM IST

Mahesh Babu: సూపర్‌స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి వెకేషన్‌కు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ దీపావళిని నమ్రత, సితార, గౌతమ్‌లతో పాటు నమ్రత సోదరి శిల్పా శిరోద్కర్ కుటుంబంతో కలిసి అక్కడే జరుపుకున్నారు. వెకేషన్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు పిక్స్ షేర్ చేస్తున్నారు నమ్రత. తాజాగా మహేష్ సూపర్ స్టైలిష్ పిక్ ఒకటి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారామె.


మహేష్ క్లీన్ షేవ్‌తో సరికొత్త లుక్‌లో హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. 45 వయసులోనూ యువకుడిలా కనిపిస్తున్నారు. ‘తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఎవరు ఇలా కనిపిస్తారు!’  అంటూ  నమ్రత కామెంట్ చేశారు.



https://10tv.in/rowdy-baby-hits-1-billion-views/
సూపర్‌స్టార్ స్టైలిష్ లుక్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. అయితే మహేష్ వెకేషన్ ముగించుకుని ఇండియా వస్తున్నారా.. లేదా మరో చోటికి టూర్ ప్లాన్ చేశారా అనేది మాత్రం తెలియలేదు. మహేష్ కొత్త సినిమా ‘సర్కారు వారి పాట’ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.