50వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) వేడుకలు ప్రతి సంవత్సరం గోవాలో ఘనంగా జరుగుతాయి. అదేవిధంగా ఈసారి 50వ IFFI వేడుకలు నవంబర్ 20 నుంచి 28వరకు ఘనంగా జరగనున్నాయి. అయితే బుధవారం (నవంబర్ 20, 2019)న ఈ అవార్డు వేడుకలు అట్టహాసంగా ప్రారంభమైంది.
ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్‌ను ప్రతిష్టాత్మక ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ అవార్డుతో సత్కరించారు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా రజనీకాంత్ ఈ అవార్డు అందుకున్నారు. ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ అవార్డు అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని రజనీకాంత్ ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ అవార్డుకు ఎంపిక చేసినందుకు భారత ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.
ఇక రజనీకాంత్ తనకొచ్చిన ఈ అవార్డును తన నిర్మాతలు, డైరెక్టర్లు, తనతో పనిచేసిన సాంకేతిక నిపుణులతో పాటు తన ఫ్యాన్స్‌కు అంకితమిస్తున్నట్లు చెప్పారు. నవంబర్ 28 వరకు గోవాలో ఈ గోల్డెన్ జూబ్లీ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అవార్డుల కార్యక్రమం జరగనుంది.
#IFFI50 Live
One of the most acclaimed and influential actors in India, Shri @rajinikanth was honoured with a special award “Icon of the Golden Jubilee of IFFI”#IFFI2019@satija_amit @MIB_India @PIB_India @esg_goa pic.twitter.com/u2aa1uFKhT
— IFFI 2019 (@IFFIGoa) November 20, 2019