Site icon 10TV Telugu

పాలిటిక్స్ కు ఇంకా టైముంది! రజనీకాంత్ 168 ప్రారంభం

Superstar Rajinikanth's 168 launched with Pooja Ceremony

సూపర్ స్టార్ రజనీకాంత్ 168వ సినిమా బుధవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది..

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ ‘దర్బార్’ తర్వాత సిరుత్తై శివ దర్శకత్వంలో చేయనున్న సినిమా బుధవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. రజినీ నటిస్తున్న 168వ సినిమా ఇది.

సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మీనా, ఖుష్బూ కీలక పాత్రల్లో కనిపించనుండగా.. ప్రకాష్ రాజ్, కీర్తి సురేష్, సూరి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ కార్యక్రమంలో రజినీ, మీనా, ఖుష్బూ, సంగీత దర్శకుడు ఇమాన్, దర్శకుడు శివ తదితరులు పాల్గొన్నారు.

త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. రజనీకాంత్, నయనతార జంటగా ఏ.ఆర్. మురగదాస్ డైరెక్షన్లో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దర్బార్’ సంక్రాంతి కానుకగా 2020 జనవరి 9న విడుదల కానుంది.
 

Exit mobile version