Supritha : పెళ్లి సంబంధాలు చూడమన్నాను.. నాకెలాంటి అబ్బాయి కావాలంటే.. పెళ్లిపై సుప్రీత కామెంట్స్ వైరల్..
తాజాగా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన లవ్ బ్రేకప్ స్టోరీలతో పాటు తనకు పెళ్లి చేసుకోడానికి ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పుకొచ్చింది సుప్రీత. (Supritha)
- Saketh U
- Published on- October 5, 2026 / 08:37 AM IST
Supritha
Supritha : సురేఖవాణి కూతురుగా అందరికి పరిచయం అయిన సుప్రీత ప్రస్తుతం సోషల్ మీడియా, టీవీ షోలతో దూసుకుపోతుంది. హీరోయిన్ గా కూడా సినిమాలు చేస్తుంది. తాజాగా ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన లవ్ బ్రేకప్ స్టోరీలతో పాటు తనకు పెళ్లి చేసుకోడానికి ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పుకొచ్చింది సుప్రీత.
Also Read : Supritha : మూడు లవ్ బ్రేకప్స్.. ట్రామా అనుభవించా.. ఇప్పటికి మెడిసిన్స్ వాడుతున్నా.. పాపం సుప్రీత..
సుప్రీత మాట్లాడుతూ.. నాకు గతంలో మూడు లవ్ స్టోరీలు ఉన్నాయి. అవి బ్రేకప్ అయ్యాయి. ఆ బ్రేకప్ ట్రామా కూడా అనుభవించాను. ఇప్పుడు నేను ఏ రిలేషన్ లో లేను. ప్రస్తుతం నేను సింగిల్ గానే ఉన్నాను. నాకు కావాల్సిన అబ్బాయి దొరకట్లేదు. కోపంలో, చిరాకుతో నేను ఏది పడితే అది అంటాను. నేను అన్నప్పుడు అర్ధం చేసుకునే అబ్బాయి కావాలి. మా అమ్మని, నన్ను బాగా చూసుకునే అబ్బాయి రావాలి. నేను అలిగితే రాత్రికి రాత్రి ట్రిప్ కి తీసుకెళ్లాలి. నేను కూడా అతన్ని తీసుకెళ్తాను. అన్నిటికంటే మంచి మనుసు ఉండాలి. చూడటానికి కొంచెం బాగుండాలి. నాకు 25 ఏళ్ళు. నాకు కావాల్సిన అబ్బాయి దొరికితే కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను.
మా అమ్మకి, అమ్మమ్మకి కూడా సంబంధాలు చూడమని చెప్పాను. కానీ మా అమ్మ అప్పుడే పెళ్లి ఎందుకు, కొంచెం ఎంజాయ్ చెయ్ లైఫ్ అని చెప్పింది. ఇటీవల డైవర్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఆలోచించు అని చెప్పింది. నేను పెళ్లి చేస్తే అబ్బాయిని నా కంట్రోల్ లో పెట్టుకుంటానని అమ్మకు చెప్పాను అని తెలిపింది.
