నీ కంటే కుక్క బెటర్.. యువకుడిపై చెలరేగిపోయిన సురేఖా వాణి..

సోషల్ మీడియాలో తనను కామెంట్ చేసిన వ్యక్తికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన సురేఖా వాణి..

  • Publish Date - March 15, 2020 / 08:54 AM IST

సోషల్ మీడియాలో తనను కామెంట్ చేసిన వ్యక్తికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన సురేఖా వాణి..

సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీలు సామాన్యులకు అందుబాటులో ఉంటున్నారు. వారి ప్రొఫెషనల్, పర్సనల్ అప్ డేట్స్, లేటెస్ట్ ఫోటోస్ వంటివి ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తుండడంతో వైరల్ అవుతున్నాయి. సెలబ్స్‌కు ఒక్కోసారి నెటిజన్ల నుండి అనుకోని సంఘటనలు ఎదురవుతుంటాయి.

తాజాగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి ఓ నెటిజన్‌పై ఫైర్ అయింది. సురేఖా వాణి తన కూతురు సుప్రితతో కలిసి హాలిడే ట్రిప్‌కు వెళ్లిన ఫోటోలు, డ్యాన్స్ వీడియోలు వంటివి పోస్ట్ చేస్తుంటుంది. ఇటీవల ఆమె షేర్ చేసిన పిక్స్, వీడియోల గురించి నెగెటివ్ కామెంట్లు ఎక్కువ వస్తున్నాయి. సురేఖాతో పాటు ఆమె కూతురు చిట్టి, పొట్టి డ్రస్సులు దిగి ఫోటోలకు ఫోజులివ్వడాన్ని ఓ నెటిజన్ తప్పుబట్టాడు.

సినిమాల్లో సంప్రదాయంగా కనిపించే సురేఖా బయట ఇలా ఉంటుందా.. ఒక కూతురిని ఇలా పెంచకూడదంటూ కామెంట్ చేశాడు. ఈ కామెంట్లు చూసిన సురేఖా వాణి.. నెటిజన్‌పై ఫైర్ అయింది. అతగాడిని కుక్కతో పోలుస్తూ షాకింగ్ కామెంట్ చేసింది. ‘‘నీ కంటే వీధి కుక్కలు లైఫ్‌ను చాలా బాగా లీడ్ చేస్తాయి. నీ ఆలోచనకు హ్యాట్సాఫ్’’ అంటూ నెటిజన్‌కు రిప్లై ఇవ్వడంతో అతగాడి నుండి నో రిప్లై.. సురేఖా చేసిన కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

 

 

 

ట్రెండింగ్ వార్తలు