Surekha Vani Supritha
Surekha Vani Supritha : టాలీవుడ్ సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి అందరికి పరిచయమే. తన కూతురు సుప్రీత ఇప్పటికే సోషల్ మీడియాతో ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది. సుప్రీత ఇప్పుడు హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. అమర్‌దీప్ చౌదరి, సుప్రీత నాయుడు జంటగా ‘చౌదరి గారి అబ్బాయి తో నాయుడు గారి అమ్మాయి’ అనే సినిమా రాబోతుంది. M3 మీడియా బ్యానర్‌పై నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మాణంలో మల్యాద్రి రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.(Surekha Vani Supritha)
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఆల్రెడీ ఈ సినిమా నుంచి ఓ సాంగ్ కూడా రిలీజ్ చేసారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. ఈ డబ్బింగ్ లో కూతురికి దగ్గరుండి మరీ ట్రైనింగ్ ఇస్తుందట సురేఖవాణి. తన సినిమాల అనుభవంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తున్న సుప్రీతకు సినిమాకు సంబంధించిన అన్ని విషయాల్లో సహకారం అందిస్తుంది. డబ్బింగ్ థియేటర్ కి కూడా వచ్చి కూతురు డబ్బింగ్ ని దగ్గరుండి పర్యవేక్షించిందట సురేఖవాణి.
సుప్రీత ఈ సినిమాకు డబ్బింగ్ చెప్తున్న ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. దీంతో కూతుర్ని హీరోయిన్ గా లాంచ్ చేయడానికి సురేఖవాణి బాగానే కష్టపడుతుంది అని అభినందిస్తున్నారు. ఇక ఈ సినిమా 2026లో రిలీజ్ అవ్వనుందని సమాచారం.