Supritha
Supritha : సురేఖవాణి కూతురు సుప్రీత ఇప్పటికే సోషల్ మీడియాలో ఫేమ్ తెచ్చుకుంది. త్వరలో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది. సుప్రీత హీరోయిన్ గా నటించిన అమరావతికి ఆహ్వానం సినిమా ఫిబ్రవరి 13న రిలీజ్ కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలలో పలు ఆసక్తికర విషయాలు మాట్లాడింది.(Supritha)
సుప్రీత తండ్రి కొన్నేళ్ల క్రితం మరణించిన సంగతి తెలిసిందే. తన తండ్రి చనిపోయాక సురేఖవాణి బొట్టు పెట్టుకొని సంప్రదాయంగా రెడీ అయితే కొంతమంది నెగిటివ్ కామెంట్స్ చేసారు, కొంతమంది రెండో పెళ్లి చేసుకుంది అన్నారు. ఇలాంటి వాటిపై సుప్రీత స్పందించింది.
Also Read : Supritha : అమ్మ మీద డ్రగ్స్, నా మీద బెట్టింగ్ యాప్స్ ఆరోపణలు.. అమ్మకు ఏమైనా అయితే.. ఎమోషనల్ అయిన సుప్రీత..
సుప్రీత మాట్లాడుతూ.. మా నాన్న చనిపోయినపుడు మా అమ్మకు జస్ట్ 36 ఏళ్ళు. తాళి తీసేయాలి, బొట్టు పెట్టుకోకూడదు, గాజులు వేసుకోకూడదు ఇవన్నీ ఎప్పుడో పాతకాలంలో మనం పెట్టుకున్నవి. దేవుడు ఎక్కడా వచ్చి చెప్పలేదు. మా అమ్మ కూడా నాన్న చనిపోయాక కొన్ని రోజులు బొట్టు పెట్టుకోలేదు.
మా అమ్మ కుంకుమ పెట్టుకున్నందుకు ఇంకో పెళ్లి చేసుకుంది అని రాసారు. ఆమె నా ఫోర్స్ వల్లే పెట్టుకుంది. మనం అలాంటి జనరేషన్ లో లేము. భర్త చనిపోయిన వాళ్ళు ఇలాగే ఉండాలి అని అందరూ అనుకుంటారు. ఆవిడ అలా లేదు కాబట్టే ఆమె మీద నెగిటివిటి ఉంది. నా లైఫ్ లో నేను చూసిన స్ట్రాంగ్ వుమెన్ మా అమ్మే అని తెలిపింది.
Also Read : NTR : డ్రాగన్ కోసం ఆ దేశానికి బయలుదేరిన ఎన్టీఆర్.. లేటెస్ట్ లుక్ చూసారా..ఫోటోలు వైరల్..
అలాగే తన తల్లి రెండో పెళ్లి గురించి మాట్లాడుతూ.. మా అమ్మకు పెళ్లి చేద్దాం అనే ఆలోచన నాకు కూడా ఉంది. కానీ తనకి నాన్నతోనే ఆగిపోవాలని ఉంది. ఆ ప్లేస్ లో ఎవరిని రానివ్వకూడదు అనుకుంటుంది అని చెప్పింది. నేను పెళ్లి చేసుకునే ముందు అయినా మా అమ్మకు పెళ్లి చేయాలి అనే ఆలోచన ఉందని తెలిపింది.