NTR : డ్రాగన్ కోసం ఆ దేశానికి బయలుదేరిన ఎన్టీఆర్.. లేటెస్ట్ లుక్ చూసారా..ఫోటోలు వైరల్..
ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్ వెళ్తుండగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. (NTR)
NTR
NTR : ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్టీఆర్ చాలా సన్నబడి ఈ సినిమా షూట్ నుంచి ఫోటోలు లీక్ అవ్వడంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.(NTR)
ఎన్టీఆర్ షూట్ లో గాయపడటం, మరోసారి హెల్త్ సహకరించకపోవడం, మధ్యలో స్క్రిప్ట్ ఛేంజింగ్ వల్ల ఈ సినిమా షూటింగ్ కి గ్యాప్స్ వస్తున్నాయి. తాజాగా ఎన్టీఆర్ – నీల్ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ జోర్డాన్ దేశంలో మొదలు కానుంది. ఈ మేరకు ఎన్టీఆర్ నేడు జోర్డాన్ దేశానికి బయలుదేరారు. జోర్డాన్ లో డ్రాగన్ సినిమా యాక్షన్ సీక్వెన్స్ లు షూట్ చేయబోతున్నట్టు సమాచారం.
Also Read : YS Jagan : వైఎస్ జగన్ తో స్టార్ హీరోలు సూర్య, కార్తీ మీటింగ్.. సూర్యని హత్తుకున్న జగన్.. వీడియో వైరల్..
ఎయిర్ పోర్ట్ లో ఎన్టీఆర్ వెళ్తుండగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. స్టైలిష్ గడ్డంతో టీ షర్ట్ వేసుకొని కళ్ళజోడు పెట్టుకొని పవర్ఫుల్ లుక్స్ తో ఎన్టీఆర్ కనిపించారు. దీంతో లుక్స్ అదిరిపోయాయి అంటూ ఫ్యాన్స్ ఈ ఫోటోలను వైరల్ చేస్తున్నారు.

