Etharkkum Thunindhavan : సూర్య 40.. ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్..

సూర్య పుట్టినరోజు సందర్భంగా.. ‘ఎదర్కుం తునిందవన్’ ఫస్ట్‌లుక్ పోస్టర్, వీడియో రిలీజ్ చేశారు..

Etharkkum Thunindhavan

Etharkkum Thunindhavan: తమిళ్‌తో పాటు తెలుగులోనూ ప్రేక్షకాదరణ, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు స్టార్ హీరో సూర్య. ఇటీవల ఆయన నటించిన ‘ఆకాశం నీ హద్దురా’ తో సాలిడ్ హిట్ అందుకున్న సూర్య ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ పాండిరాజ్ దర్శకత్వంలో నటిస్తున్నారు. కళానిధి మారణ్ సమర్పణలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది.

జూలై 23 సూర్య పుట్టినరోజు సందర్భంగా.. ‘ఎదర్కుం తునిందవన్’ ఫస్ట్‌లుక్ పోస్టర్, వీడియో రిలీజ్ చేశారు. సూర్య నటిస్తున్న 40వ సినిమా ఇది. రఫ్ లుక్‌లో సరికొత్తగా కనిపించి ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్ చేశారు సూర్య. కంప్లీట్ మాస్ క్యారెక్టర్‌లో ఈసారి పక్కాగా హిట్ కొట్టడం ఖాయం అనిపిస్తోంది.

సూర్య పక్కన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సత్యరాజ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. డి.ఇమాన్ సంగీతమందిస్తున్నారు. సూర్య ఇమేజ్‌కి తగ్గట్టు కమర్షియల్ కథకు మెసేజ్ యాడ్ చేసి తెరకెక్కిస్తున్న ‘ఎదర్కుం తునిందవన్’ తెలుగులోనూ రిలీజ్ కానుంది.