Kajal Aggarwal Kiss Making Scene About: ‘ఇంగ్లీష్ సినిమా అంటే ముద్దు తెలుగు సినిమా అన్నాక హద్దు ఉండాలి’ అనేమాట సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు ఎక్కువగా వినిపించేది. హాలీవుడ్, బాలీవుడ్ ఆ తర్వాత మన టాలీవుడ్‌కి కూడా ఈ ముద్దు కల్చర్ పాకింది. బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో హీరో హీరోయిన్ కౌగలించుకోవడం, ముద్దు పెట్టుకోవడం వంటివన్నీ కెమెరా ట్రిక్స్ అని చెప్పేవాళ్లు. రాను రాను ముద్దులు హద్దులుదాటి లిప్‌లాక్‌లు, అతిగాఢమైన అధర చుంబనాలు వచ్చేశాయి.
ఈ సినిమాలో సూర్య, కాజల్ మధ్య థియేటర్లో ఓ లిప్‌లాక్ షాట్ ఉంటుంది. అయితే అది నిజంగా పెట్టిన ముద్దు కాదని, ఆ షాట్ చేయడానికి సూర్య ఇబ్బందిగా ఫీల్ అవుతుండడంతో డైరెక్టర్ కాస్త వెరైటీగా థింక్ చేసి బ్లూ మ్యాట్ సాయంతో ముద్దు సన్నివేశాన్ని తీశారని చెప్పింది కాజల్. బ్లూ మ్యాట్‌లో సూర్యతో గ్లాస్(అద్దం)కి తర్వాత తనచేత ఓ బొమ్మకి ముద్దు పెట్టించి దాన్ని లిప్‌లాక్‌గా ఎడిట్ చేశారని చెప్పుకొచ్చింది. దీంతో హీరోయిన్‌గా 50కి పైగా సినిమాలు చేశావు.. అయినా ఏ హీరోతోనూ లిప్‌లాక్ చేయలేదా అంటూ కాజల్ నటించిన పలు సినిమాల్లోని ముద్దు ఫొటోలు జతచేసి మరీ ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్. హిందీ చిత్రం ‘దో లఫ్జోంగీ కహాని’లో రణదీప్ హుడాతో కాజల్ రెచ్చిపోయి మరీ లిప్‌లాక్ చేసింది.