Karuppu: ‘కరుప్పు’ బ్లాక్‌ బస్టర్ హిట్.. కెమెరామెన్‌కు సూర్య కాస్లీ కారు గిఫ్ట్

కరుప్పు(Karuppu) సినిమా భారీ సక్సెస్ తో కెమెరామెన్ కు ఖరీదైన కారు గిఫ్ట్ గా ఇచ్చిన హీరో సూర్య.

Suriya costly gift to cinematographer gk vishnu for karuppu movie huge success

  • ‘కరుప్పు’ బాక్సాఫీస్ రికార్డుల సునామీ.
  • కెమెరామెన్‌కు సూర్య కారు గిఫ్ట్.
  • నెట్టింట వైరల్ అవుతున్న ఫోటోలు.

Karuppu; కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం ‘కరుప్పు(Karuppu)’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించింది. మే 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా కేవలం కొద్ది రోజుల్లోనే రూ. 320 కోట్ల క్లబ్‌లో చేరి సంచలనం సృష్టించింది. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య, త్రిష కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం తమిళనాడులోనే రూ.150 కోట్ల గ్రాస్ సాధించి, సూర్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా సరికొత్త రికార్డు నెలకొల్పింది.

Premalu 2: అసలు కథే లేదు.. ప్రేమలు సీక్వెల్ పై అధికారిక ప్రకటన చేసిన టీమ్

ఈ భారీ విజయం అందించిన జోష్‌తో చిత్ర యూనిట్ సక్సెస్ వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో, సినిమాకు అద్భుతమైన విజువల్స్ అందించిన టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్ జికె విష్ణు పనితనానికి ఫిదా అయిన హీరో సూర్య ఆయనకు ఒక ఖరీదైన సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. కరుప్పు చిత్రంలో విజువల్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండటంతో, జికె విష్ణుకు సరికొత్త ‘మహీంద్రా BE6 బ్యాట్‌మాన్ ఎడిషన్’ కారును సూర్య కానుకగా అందజేశారు.

ఈ అద్భుతమైన బహుమతి అందుకున్న సినిమాటోగ్రాఫర్ జికె విష్ణు తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. కొత్త కారుతో దిగిన ఫోటోను ఎక్స్‌లో షేర్ చేస్తూ.. సూర్య సర్‌కు పెద్ద మనసు ఉందంటూ ఎమోషనల్ క్యాప్షన్ రాసుకొచ్చారు. జికె విష్ణు కెమెరా వర్క్‌పై ప్రేక్షకుల నుండి ప్రశంసలు కురుస్తుండగా, సూర్య ఇచ్చిన ఈ కాస్లీ గిఫ్ట్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.