Premalu 2: అసలు కథే లేదు.. ప్రేమలు సీక్వెల్ పై అధికారిక ప్రకటన చేసిన టీమ్
ప్రేమలు 2(Premalu 2)పై అధికారిక ప్రకటన చేసిన మేకర్స్.
Makers Issue Official Announcement Canceling Premalu 2
- ‘ప్రేమలు 2’ సీక్వెల్ రద్దయింది.
- కథ కుదరకపోవడమే ముఖ్య కారణం.
- నిర్మాతల నిర్ణయం సరైనదేనని టాక్.
Premalu 2: మలయాళంతో పాటు తెలుగులోనూ ఘనవిజయం సాధించిన ‘ప్రేమలు’. ఈ సినిమాకు సీక్వెల్ రానుందంటూ గతంలో ప్రకటనలు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో, ఆడియన్స్ కూడా ఈ సీక్వెల్ కోసం ఆసక్తికరంగా ఎదురుచూశారు. అయితే, షూటింగ్ ప్రారంభం కాకుండానే ‘ప్రేమలు 2(Premalu 2)’ ప్రాజెక్ట్‌ను నిర్మాతలు అధికారికంగా రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. కేవలం క్రేజ్ ఉందనే కారణంతో కాకుండా, కథా పరంగా ఆశించిన స్థాయిలో వినోదం కుదరకపోవడం వల్లే ఈ సీక్వెల్ ఆలోచనను విరమించుకున్నట్లు సమాచారం.
H Vinoth: నిజాలు మాట్లాడే ధైర్యం నాకు లేదు.. జన నాయకుడు డైరెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు
మరోవైపు, ఈ చిత్ర కథానాయకుడు నస్లెన్ వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల కాల్ షీట్స్ సర్దుబాటు చేయలేని పరిస్థితి నెలకొంది. అలాగే కథానాయిక మమితా బైజు కూడా వరుసగా సీరియస్ పాత్రలు చేస్తుండటంతో, ఆమె లుక్స్‌లో మార్పులు వచ్చాయి. దీనివల్ల మొదటి భాగంలో ఉన్న కాలేజీ అమ్మాయి తరహా అమాయకత్వం, ఆ టీనేజ్ లుక్‌ను మళ్లీ తెరపై ఆవిష్కరించడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
టాలీవుడ్లో ఇటీవల అవసరం ఉన్నా లేకపోయినా ప్రతి చిత్రానికి సీక్వెల్స్ ప్రకటించడం ఒక ట్రెండ్‌గా మారింది. ‘డెవిల్’, ‘యశోద’ వంటి చిత్రాలు పార్ట్-2 అంటూ హడావిడి చేసినా ఆ తర్వాత ఆ ఊసే లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో, సరైన స్క్రిప్ట్ లేకుండా బలవంతంగా సీక్వెల్స్ తీసి ఫ్లాప్ అవ్వడం కంటే, ‘ప్రేమలు 2’ను ఇక్కడితోనే ఆపేయడం సరైన నిర్ణయమని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
