H Vinoth: నిజాలు మాట్లాడే ధైర్యం నాకు లేదు.. జన నాయకుడు డైరెక్టర్ వివాదాస్పద వ్యాఖ్యలు
విజయ్ దళపతి జన నాయగన్ సినిమా విడుదలపై దర్శకుడు హెచ్.వినోద్(H Vinoth) షాకింగ్ కామెంట్స్.
Director H Vinoth shocking comments on Vijay thalapathy jana nayagan release
- ‘జన నాయగన్’ విడుదలపై సస్పెన్స్.
- డైరెక్టర్ హెచ్.వినోద్ సంచలన వ్యాఖ్యలు.
- సెన్సార్ వివాదంలో విజయ్ సినిమా.
H Vinoth: దళపతి విజయ్ కథానాయకుడిగా దర్శకుడు హెచ్.వినోద్ రూపొందిస్తున్న ‘జన నాయగన్’ సినిమా విడుదలపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరిలోనే ప్రేక్షకుల ముందుకు రావలసిన ఈ చిత్రం, సెన్సార్ సమస్యల కారణంగా కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రత్యేక రివైజింగ్ కమిటీ పరిశీలనలో ఉందని, ఆ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని నిర్మాత వెంకట్ కె. నారాయణ ఇటీవల స్పష్టం చేశారు.
Raashii Khanna: రాసులు పోసి పెంచినట్టుగా రాశి ఖన్నా అందాలు.. క్రేజీ ఫొటోలు
ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న దర్శకుడు హెచ్.వినోద్(H Vinoth) ఈ వివాదంపై స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా విడుదల అనేది ఎప్పుడూ మన చేతుల్లో ఉండదని ఆయన పేర్కొన్నారు. ఈ చిత్ర ఆలస్యానికి సంబంధించిన అసలు నిజాలు మాట్లాడేంత ధైర్యం తనకు లేదని, ఒకవేళ తను నిజాలు చెప్పినా, వాటిని ప్రసారం చేసే గుండెధైర్యం మీడియాకు కూడా ఉండదని వినోద్ వ్యాఖ్యానించడం ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది.
విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో ఈ సినిమా చకచకా విడుదలైపోతుందని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ రాజకీయ, సెన్సార్ కారణాల వల్ల ఈ వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేకపోతోంది. దర్శకుడి తాజా వ్యాఖ్యలతో ఈ సినిమా చుట్టూ ఉన్న వివాదం మరింత ముదిరినట్లయింది, అలాగే సినిమా విడుదలపై అభిమానుల్లో ఉత్కంఠను మరింత పెంచింది.
