Etharkkum Thunindhavan : సూర్య సినిమా పాన్ ఇండియా రిలీజ్!

పాన్ ఇండియా స్థాయిలో సూర్య ‘ఎదర్కుం తునిందవన్’ చిత్రాన్ని రిలీజ్ చెయ్యబోతున్నారు..

  • Updated on- February 1, 2022 / 06:33 PM IST

Etharkkum Thunindhavan

Etharkkum Thunindhavan: తమిళ్‌తో పాటు తెలుగులోనూ ప్రేక్షకాదరణ, ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు స్టార్ హీరో సూర్య. తెలుగులో సూర్య సినిమాలకు మంచి మార్కెట్ ఉంది. ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ సినిమాలతో సాలిడ్ హిట్స్ అందుకుని ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చెయ్యడమే కాకుండా.. సొసైటీలోనూ ఆలోచనను రేకెత్తించారు.

RajiniKanth : ఐశ్వర్య-ధనుష్ విడాకులు.. రజినీ ధైర్యంగా ఉండాలంటూ ఫ్యాన్స్ పోస్టులు

ప్రేక్షకుల ప్రశంసలతో పాటు అవార్డులు కూడా దక్కించుకున్నాయి ఈ రెండు సినిమాలు.. సూర్య ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ పాండిరాజ్ దర్శకత్వంలో ‘ఎదర్కుం తునిందవన్’ సినిమా చేస్తున్నారు. సూర్య నటిస్తున్న 40వ సినిమా ఇది. ప్రియాంక మోహన్ కథానాయిక. కళానిధి మారణ్ సమర్పణలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోలకు, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

RGV : ధనుష్ ఐశ్వర్య విడాకులపై వర్మ ట్వీట్లు

సినిమాను ఫిబ్రవరి 4న థియేటర్లలో రిలీజ్ చెయ్యాలని ఫిక్స్ అయ్యారు. పాన్ ఇండియా స్థాయిలో ‘ఎదర్కుం తునిందవన్’ చిత్రాన్ని రిలీజ్ చెయ్యబోతున్నారు. సూర్య కెరీర్‌లో ఫస్ట్ టైం పాన్ ఇండియా రిలీజ్ ఇది. రీసెంట్‌గా సెన్సార్ పనులు పూర్తయ్యాయి. సినిమా చూసిన సెన్సార్ టీమ్ U/A సర్టిఫికెట్ జారీ చేశారు. సినిమా నిడివి 2 గంటల 30 నిమిషాల 38 సెకన్లకు ఫిక్స్ చేశారు. తెలుగు రిలీజ్ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.