సుధ కొంగర దర్శకత్వంలో డెక్కన్ ఎయిర్‌వేస్ అధినేత కెప్టెన్ గోఫినాధ్ జీవితం ఆధారంగా తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న సినిమా.. ‘సూరరై పోట్రు’ తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో విడుదల కానుంది. గురువారం ఈ మూవీ సింగిల్ ట్రాక్ చెన్నై విమానశ్రయం రన్ వే పై జరిగింది.
స్పైస్ జెట్ విమానయాన సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆడియో ట్రాక్ కార్యక్రమంలో నటుడు సూర్య, మోహన్ బాబు, శివకుమార్, దర్శకురాలు సుధ కొంగర, మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ చిత్రయూనిట్‌తో పాటు స్పైస్ జెట్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తెలుగు ట్రాక్ ను నటుడు మోహన్ బాబు విడుదల చేసి నటుడు శివకుమార్ కు అందచేయగా, తమిళ్ ట్రాక్ ను నటుడు శివకుమార్ విడుదల చేసి మోహన్ బాబు అందచేశారు. సామాన్యుడికి సైతం ఆకాశంలో విహరించేలా విమాన ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చిన కెప్టెన్ గోపినాధ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ద్వారా విమానంలో ప్రయాణించాలనే ఆశ, కోరిక కలిగిన 70 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను 45 నిమిషాలపాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విమానంలో విహరింపచేశారు.
తమిళనాడు వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే 70 మంది విద్యార్థులను సూర్యకు చెందిన అగరం పౌండేషన్ ద్వారా ఎంపిక చేసి వారికి విమానంలో విహరించే అవకాశం కల్పించారు. చిత్ర నటులు, యూనిట్‌తో కలిసి 70 మంది విద్యార్థులతో చెన్నై విమానాశ్రయంలో బయలు దేరిన ఈ విమానం బంగాళాఖాతంపై చక్కెర్లు కొడుతూ చెన్నై నగరనాన్ని చుడుతూ తిరిగి విమానాశ్రయానికి చేరుకుంది. తమ కలను సాకారం చేసినందుకు సూర్యకు, చిత్రబృందానికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.