Karuppu Sequel: ‘కరుప్పు సీక్వెల్’పై సూర్య ఆసక్తికర కామెంట్స్.. త్వరలోనే అధికారిక ప్రకటన

కరుప్పు సీక్వెల్(Karuppu Sequel) గురించి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన సూర్య.

Suriya interesting comments on Karuppu sequel

  • సూర్య ‘కరుప్పు’ భారీ విజయం.
  • రూ.300 కోట్ల కలెక్షన్ల వేట.
  • సీక్వెల్‌పై సూర్య క్రేజీ హింట్.

Karuppu Sequel: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది ‘కరుప్పు’ (తెలుగులో వీరభద్రుడు). సూర్య, త్రిష ప్రధాన పాత్రల్లో ఆర్జే బాలాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. మే 15న విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్ల వసూళ్ల దిశగా దూసుకుపోతోంది. ఈ భారీ విజయం పట్ల చిత్రబృందం తాజాగా సక్సెస్ మీట్‌ను నిర్వహించి తమ ఆనందాన్ని పంచుకుంది.

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ సాంగ్ లాంచ్ ఈవెంట్.. సందడి చేసిన టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్.. ఫొటోలు

ఈ వేడుకలో హీరో సూర్య మాట్లాడుతూ.. దర్శకుడు ఆర్జే బాలాజీ విజన్‌ను నమ్మి కేవలం గంట వ్యవధిలోనే ఈ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చానని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌పై సంతకం చేసిన మొదటి రోజు నుంచే అంతా సానుకూలంగా జరిగిందని గుర్తుచేసుకున్నారు. సినిమా విజయం సాధిస్తుందని ముందే ఊహించినప్పటికీ, తమ అంచనాలను మించి ఇంత భారీ స్థాయిలో బ్లాక్ బస్టర్ కావడం నిజంగా అద్భుతమని సంతోషం వ్యక్తం చేశారు.

ఇదే వేదికపై అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘కరుప్పు’ సీక్వెల్‌(Karuppu Sequel)’పై సూర్య ఆసక్తికర కామెంట్స్.. త్వరలోనే అధికారిక ప్రకటన
)పై సూర్య క్రేజీ హింట్ ఇచ్చారు. రెండో భాగం రావాలని తాను కూడా అంతే ఆసక్తితో ఉన్నానని, దీనికి సంబంధించిన అప్‌డేట్స్ త్వరలోనే వస్తాయని నవ్వుతూ సమాధానమిచ్చారు. ఈ సంచలన కలెక్షన్లపై దర్శకుడు ఆర్జే బాలాజీ స్పందిస్తూ, అంతా దేవుడి దయ వల్లే సాధ్యమైందని చిత్ర యూనిట్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇక సూర్య నుంచి వస్తున్న నెక్స్ట్ మూవీ విశ్వనాధ్ అండ్ సన్స్ త్వరలోనే విడుదల కానుంది.