Surya Karuppu movie in a new controversy
Karuppu: తమిళ స్టార్ సూర్య కరుప్పు మూవీపై కొత్త వివాదం రాజుకుంది. ఈ సినిమా నిర్మాత, హీరోపై కేసు వేసేందుకు దర్శకుడు ఆర్జే బాలాజీ సిద్ధం అవుతున్నాడు. దీంతో, ఈ వివాదం ఇప్పుడు తమిళ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. స్టార్ హీరో సూర్య హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కరుప్పు(Karuppu). పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ఆర్జే బాలాజీ తెరకెక్కిస్తున్నాడు.
అయితే, విడుదల దగ్గరపడుతున్న వేళ వివాదంలో ఇరుక్కుందట ఈ సినిమా. దీనికి సంబందించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కరుప్పు సినిమా నిర్మాత, హీరోలపై దర్శకుడు కేసు వేయాలనే ప్రయత్నంలో ఉన్నాడట. దానికి కారణం, సినిమా విడుదల ఆలస్యం అవడమేనాని. సినిమా పూర్తయినా వ్యక్తిగత కారణాల వల్ల కావాలనే విడుదల చేయడం లేదని, పారితోషకం విషయంలో కూడా మేకర్స్ మధ్య విభేదాలు తలెత్తాయని తెలుస్తోంది. అందుకే, దర్శకుడు కేసు వేయాలని చూస్తున్నట్టుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.
అయితే, కరుప్పు నిర్మాత నుంచి వినిపిస్తున్న సమాచారం మేరకు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ఫేక్ అని తెలుస్తోంది. దర్శకుడికి, నిర్మాతలకు ఎలాంటి విభేదాలు లేవని, కావాలనే ఎవరో ఇలాంటి రూమర్స్ ను క్రియేట్ చేస్తున్నారని వారు చెప్పినట్టుగా సమాచారం. ఇక త్వరలోనే కరుప్పు సినిమా విడుదలపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది.