Karuppu OTT : ఓటీటీలోకి సూర్య క‌రుప్పు.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

సూర్య హీరోగా న‌టించిన క‌రుప్పు మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ (Karuppu OTT) ఖ‌రారైంది.

Suriya Karuppu Movie OTT streaming date fix

Karuppu OTT : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య న‌టించిన మూవీ క‌రుప్పు. తెలుగులో వీర‌భ‌ద్రుడు పేరుతో రిలీజైంది. బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల వ‌ర్షం కురిపించింది. మే 15న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ చిత్రం 300 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించి సూర్య కెరీర్‌లోనే బ్లాక్ బాస్ట‌ర్ హిట్ల‌లో ఒక‌టిగా నిలిచింది. తాజాగా ఈ చిత్ర ఓటీటీ అప్‌డేట్ వ‌చ్చింది.

ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమా డిజిటల్ హక్కులను ద‌క్కించుకుంది. ఈ చిత్రాన్ని జూన్ 12 నుంచి స్ట్రీమింగ్ చేయ‌నుంది. ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టిస్తూ యాప్‌లో అప్‌డేట్ చేసింది. కేవలం తమిళంలోనే కాకుండా, తెలుగు ప్రేక్షకులకు కూడా ‘వీరభద్రుడు’ పేరుతో అదే రోజున అందుబాటులోకి రానుంది.

Mega 158 : మెగా 158లో కూలీ లేడీ విలన్!

ఈ చిత్రానికి వైవిధ్యమైన నటుడు ఆర్జే బాలాజీ దర్శకత్వం వ‌హించాడు. కేవలం మెగాఫోన్ పట్టడమే కాకుండా, సూర్యకు ధీటైన విలన్ పాత్రలో నటించి ఆయన అందరినీ ఆశ్చర్యపరిచారు. త్రిష క‌థానాయిక‌గా న‌టించింది.

Priyanka Jain : ప్రియుడి బ‌ర్త్ డే.. స్పెష‌ల్ ఫోటోలు షేర్ చేసిన సీరియ‌ల్ న‌టి ప్రియాంక‌..

సాయి అభ్యంకర్ అందించిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేశాయి. యాక్షన్, ఎమోషన్ మేళవింపుతో సాగే ఈ కథను ఆర్జే బాలాజీ డీల్ చేసిన తీరుకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రంలో ఇంద్రాస్, నట్టి సుబ్రమణియన్, అనఘ మాయ రవి, సుప్రీత్‌లు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.