తమిళ స్టార్ హీరో సూర్య తన కొత్త సినిమా ‘సూరరై పోట్రు’ కోసం ఫస్ట్ టైమ్ ర్యాప్ పాడారు..
తమిళ స్టార్ హీరో సూర్య తన కొత్త సినిమా కోసం సింగర్ అవతారమెత్తాడు. ఎయిర్ఇండియా ఫౌండర్ కెప్టెన్ జీఆర్ గోపీనాధ్ జీవితం ఆధారంగా, ‘గురు’ ఫేమ్ సుధ కొంగర దర్శకత్వంలో సూర్య నటించిన సినిమా.. ‘సూరరై పోట్రు’.. తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో విడుదల కానుంది.
2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య నిర్మిస్తున్నాడు. అపర్ణా బాలమురళి కథానాయికగా నటించింది. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. ఈ సినిమా కోసం ఫస్ట్ టైమ్ సూర్య ఓ ర్యాప్ సాంగ్ పాడారు. ఇది టైటిల్ ట్రాక్ అని తెలుస్తోంది.
Read Also : ఇప్పటివరకు ఇండియన్ స్క్రీన్‌పై చూడని పాయింట్‌తో ‘ప్రతిరోజూ పండగే’
రికార్డింగ్ స్టూడియోలో సూర్యతో కలిసి ఉన్న ఫొటోను మ్యూజిక్ డైరెక్టర్ జి.వి.ప్రకాశ్‌కుమార్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. 2020 వేసవిలో ‘ఆకాశం నీ హద్దురా’ విడుదల కానుంది. త్వరలో టీజర్ రిలీజ్ చేయనున్నారు. సంగీతం : జి.వి.ప్రకాశ్‌కుమార్, కెమెరా: నికేత్ బొమ్మి, ఎడిటింగ్ : సతీష్ సూర్య.
Mr.Maara raps … #maaratheme will be rapped by @Suriya_offl sir ??? #sooraraipottru #sudha #arivu pic.twitter.com/FBKBX57TH8
— G.V.Prakash Kumar (@gvprakash) November 18, 2019