Scene : వామ్మో.. అన్ని కోట్లకు ఓటీటీకి అమ్ముడయిన సూర్య ‘సీన్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

తాజాగా ఈ సినిమా ఓటీటీ హక్కుల గురించి ఆసక్తికర సమాచారం వినిపిస్తుంది. (Scene)

  • Published on- November 13, 2026 / 05:04 PM IST

Scene

Scene : తమిళ్ స్టార్ హీరో సూర్య ఇటీవల సీన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. క్రైమ్ కామెడీగా వచ్చిన ఈ సినిమా తమిళ్ తో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించి విజయం సాధించింది. ఇప్పటికే ఈ సినిమా 250 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. దీపావళికి రిలీజ్ అయిన ఈ సినిమా ఇంకా థియేటర్స్ లో నడుస్తుంది.

తాజాగా ఈ సినిమా ఓటీటీ హక్కుల గురించి ఆసక్తికర సమాచారం వినిపిస్తుంది. సీన్ సినిమాని నెట్ ఫ్లిక్స్ ఓటీటీ సంస్థ దాదాపు 88 కోట్లు పెట్టి కొనుక్కుందట. డిసెంబర్ మొదటి వారంలో ఈ సినిమా ఓటీటీలో రానుందని సమాచారం. ఇటీవల కాలంలో సూర్య సినిమాకు ఇదే హైయెస్ట్ అమౌంట్ అని టాక్. అలాగే తమిళ్ లో ఈ సంవత్సరం జైలర్ 2 తప్ప మిగతా సినిమాలతో పోలిస్తే సీన్ సినిమాకే ఎక్కువ ఆఫర్ చేసారంట.

Also Read : Bigg Boss Thrigun : బిగ్ బాస్ త్రిగున్ కొత్త సినిమా ‘జంగా’ గ్లింప్స్ రిలీజ్.. రా & రస్టిక్ లుక్స్‌లో త్రిగున్..

మొత్తానికి సీన్ సినిమాతో నిర్మాతగా బాగానే సక్సెస్ అయ్యాడు సూర్య. అటు థియేట్రికల్, ఇటు ఓటీటీ రైట్స్ తో బాగానే సంపాదించాడు.