Vijay-Trisha Movie: విజయ్ పర్మిషన్ ఇచ్చినా.. త్రిష సినిమాకు తప్పని అడ్డంకులు.. ఒక్క షో కూడా పడకుండానే..
Trisha Karuppu Release Issue: సూర్య, త్రిష జంటగా RJ బాలాజీ దర్శకత్వంలో వస్తున్న కరుప్పు సినిమా నేడు మే 14న రిలీజ్ అవ్వాలి. (Vijay Trisha)
- Saketh U
- Updated on- May 14, 2026 / 10:35 AM IST
Suriya Trisha Karuppu Movie Release Stopped
Karuppu Release: విజయ్ – త్రిష రిలేషన్ లో ఉన్నారనే వార్తలు రావడం, అవి నిజమే అన్నట్టు త్రిష హింట్స్ ఇవ్వడం, విజయ్ భార్య విడాకులకు అప్లై చేయడం.. గత కొన్నాళ్లుగా జరుగుతూనే ఉంది. సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారానికి కూడా హాజరయి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది త్రిష. విజయ్ సీఎం అయ్యాక త్రిష నటించిన కరుప్పు సినిమా నేడు రిలీజ్ కావాల్సి ఉంది.
సూర్య, త్రిష జంటగా RJ బాలాజీ దర్శకత్వంలో వస్తున్న కరుప్పు సినిమా నేడు మే 14న రిలీజ్ అవ్వాలి. తెలుగులో ఈ సినిమా వీరభద్రుడు అనే టైటిల్ తో రిలీజ్ కానుంది. ఈ సినిమాకు తమిళనాడులో రిలీజ్ రోజు ఉదయం 9 గంటల స్పెషల్ షోలకు కూడా పర్మిషన్ ఇచ్చారు విజయ్. విజయ్ సీఎం అవ్వగానే త్రిష సినిమాకు ఫేవర్ చేయడం తమిళ సినీ పరిశ్రమలో చర్చగా మారింది. కానీ ఒక్క షో కూడా పడకుండానే ఈ సినిమా రిలీజ్ ఆగిపోవడం గమనార్హం.
Also Read : Bindu Madhavi : కామెడీ స్కిట్స్ అంటే వల్గర్ జోక్స్ కాదు.. జబర్దస్త్ పై బిందు మాధవి సంచలన వ్యాఖ్యలు..?
ఫైనాన్స్ ఇబ్బందులతో కరుప్పు సినిమా నేడు రిలీజ్ అవ్వలేదు అని సమాచారం. అమెరికాలో ఇప్పటికే కరుప్పు షోలు పడాల్సి ఉండగా ఆ షోలు అన్ని క్యాన్సిల్ అయ్యాయి. తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉదయం షోలు క్యాన్సిల్ అయ్యాయి. దీంతో సూర్య ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. అసలే చాలా కాలంగా హిట్స్ లేకుండా ఉన్న సూర్య ఈ సినిమాతో కంబ్యాక్ ఇస్తాడని భావించారు. కానీ రిలీజ్ రోజు ఇబ్బందులతో ఈ సినిమా ఆగిపోవడంతో ఈ సినిమా ఫలితంపై ఎఫెక్ట్ గట్టిగానే పడుతుందంటున్నారు.
ఇక విజయ్ సీఎంగా ఉండి కూడా త్రిష సినిమాకు ఇలాంటి ఇబ్బందులా, విజయ్ సీఎం అయ్యాక త్రిష నుంచి వస్తున్న మొదటి సినిమా ఆగిపోవడమా, విజయ్ స్పెషల్ షోలకు పర్మిషన్ ఇచ్చినా సినిమా రిలీజ్ ఆపడమా అని తమిళనాట చర్చ జరుగుతుంది. మరి కరుప్పు సినిమా ఇవాళ రిలీజ్ అవుతుందా లేదా మళ్ళీ కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తారా చూడాలి.
Also See : Mrunal Thakur : కాటుక కళ్ళతో.. బ్లాక్ డ్రెస్ లో మృణాల్ ఠాకూర్ మెరుపులు..
