Bindu Madhavi Jabardasth: కామెడీ స్కిట్స్ అంటే వల్గర్ జోక్స్ కాదు.. జబర్దస్త్ పై బిందు మాధవి సంచలన వ్యాఖ్యలు..?
తాజాగా నటి బిందు మాధవి జబర్దస్త్ అనే పేరుని చెప్పకుండా ఇండైరెక్ట్ గా వల్గారిటీ జోక్స్ అని కామెంట్స్ చేసింది. (Bindu Madhavi)
Bindu Madhavi Sensational Comments On Jabardasth
Bindu Madhavi : తెలుగులో కామెడీ స్కిట్స్ తో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ నే షోలు ఎప్పట్నుంచో నడుస్తున్నాయి. ఈ షో చాలా పాపులర్ అయింది. ఈ షో నుంచి చాలా మంది కమెడియన్స్ వచ్చారు. అయితే ఈ షోలో డబల్ మీనింగ్ డైలాగ్స్ వాడతారు, వల్గారిటీ పాయింట్స్ మీద స్కిట్స్ చేస్తారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఫ్యామిలీతో కలిసి కొన్ని స్కిట్స్ చూడలేము అనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
తాజాగా నటి బిందు మాధవి జబర్దస్త్ షో ప్రస్తావన తీసుకురాకుండా ఇండైరెక్ట్ గా వల్గారిటీ జోక్స్ అని కామెంట్స్ చేసింది. బిందు మాధవి ఇటీవల కొత్తగా మొదలయిన మాస్ జాతర అనే కామెడీ షోకి జడ్జిగా చేస్తుంది. ఈ షో కూడా జబర్దస్త్ లాగే కామెడీ స్కిట్స్ తో నడుస్తుంది.
Also Read : Mrunal Thakur : కాటుక కళ్ళతో.. బ్లాక్ డ్రెస్ లో మృణాల్ ఠాకూర్ మెరుపులు..
బిందు మాధవి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మాస్ జాతర మొత్తం ఫుల్ ఎంటర్టైన్మెంట్. నన్ను జడ్జిగా చేయమని ఫస్ట్ వీళ్ళు అడిగినప్పుడు కామెడీ స్కిట్స్ అంటే మనోళ్లు వల్గర్ లైన్స్, వల్గర్ జోక్స్ అలాంటివన్నీ వాడతారు. అలంటి షోలు చూస్తున్నాం కదా. అందుకే ఎందుకులే అని వద్దనుకున్నాను. కానీ డైరెక్టర్ మళ్ళీ వచ్చి అసలు వల్గర్ లైన్స్ అనేవి తీసుకురాము, అలాంటివి ఉంటే మీరు షో మధ్యలోనే వెళ్లిపోవచ్చు అని భరోసా ఇచ్చారు. ఫ్యామిలీ మొత్తం చూసేలా ఉంటుంది అని చెప్పారు. అందుకే వచ్చాను. ఇప్పటివరకు 28 ఎపిసోడ్స్ అయ్యాయి. నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. తెలుగులో మొదటిసారి వల్గారిటీ జోక్స్ లేకుండా ఫ్యామిలీ అంతా కూర్చొని చూసేలా ఎంజాయ్ చేసే షో చేస్తున్నాను అని తెలిపింది.
దీంతో కామెడీ స్కిట్స్ అంటే వల్గారిటీ ఉంటుంది, వల్గారిటీ లేకుండా మేము చేస్తున్నాము అనడంతో ఇండైరెక్ట్ గా జబర్దస్త్ కి కౌంటర్ ఇచ్చిందని అంటున్నారు.
Also Read : Manju Bhargavi : ఎవర్ గ్రీన్ క్లాసిక్.. శంకరాభరణం హీరోయిన్.. ఇప్పుడు ఎలా మారిపోయిందో చూశారా..?
