Manju Bhargavi : ఎవర్ గ్రీన్ క్లాసిక్.. శంకరాభరణం హీరోయిన్.. ఇప్పుడు ఎలా మారిపోయిందో చూశారా..?
తెలుగులో ఎవర్ గ్రీన్ క్లాసిక్ గా నిలిచిన సినిమాల్లో శంకరాభరణం ఒకటి. ఆ సినిమాలో మెయిన్ లీడ్ గా నటించి మెప్పించిన మంజు భార్గవి ప్రస్తుతం సినిమాలకు దూరంగానే ఉంటున్నారు. కరోనా తర్వాత సినిమాలు ఆపేసిన మంజు భార్గవి త్వరలో రాజా ది రాజా అనే సినిమాలో కీలకపాత్రలో కనిపించబోతున్నారు. తాజాగా ఈ సినిమా ప్రెస్ మీట్ హైదరాబాద్ లో నిర్వహించగా హాజరయి సందడి చేసారు. ఈ ఈవెంట్లో ఆమెను చూసి అప్పటి క్లాసికల్ డ్యాన్సర్, నటి మంజు భార్గవి ఎంతలా మారిపోయిందో అని ఆశ్చర్యపోతున్నారు.

Sankarabharanam Manju Bhargavi









