Gold Silver Price Today : శ్రావణ మాసం ఎఫెక్ట్.. బంగారం ప్రియులకు బిగ్‌షాక్.. అసలు కారణమిదే.. నేటి ధరలు ఇలా..
Gold Silver Price Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ షాక్. ఇవాళ కూడా గోల్డ్ రేటు పెరిగింది.

బంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. రోజురోజుకు భారీగా పెరుగుతున్న ధరలకు శ్రావణ మాసం తోడైంది. దీంతో సెప్టెంబర్ నెల చివరి వరకు బంగారం రేట్లు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో ఉద్రిక్తత కారణంగా గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. మరోవైపు.. ఆగస్టు 13 నుంచి శ్రావణ మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో శుభముహూర్తాలు ఎక్కువే. ఆగస్టు, సెప్టెంబర్ నెల మధ్య వరకు శుభముహూర్తాలు ఉన్నాయి. ఈ ముహూర్తాల్లో భారీ సంఖ్యలో పెండ్లిళ్లు, ఇతర శుభకార్యాలు జరగనున్నాయి. దీంతో బంగారం కొనుగోళ్లు పుంజుకోనున్నాయి. ప్రస్తుతం ఉన్న ధరలకుతోడు కొనుగోళ్లు పెరగడంతో బంగారం ధరలకు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.270 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 250 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఇవాళ గోల్డ్ రేటు కాస్త తగ్గింది. ప్రస్తుతం అక్కడ ఔన్స్ గోల్డ్ 4,397 డాలర్ల వద్ద కొనసాగుతోంది. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,55,130 వద్దకు చేరగా. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,42,200 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,55,280 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,42,350 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్‌కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,55,130కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,42,200 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,60,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,55,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,60,000 వద్ద కొనసాగుతోంది.

గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు
