Sushant Singh Rajput : తన యజమాని కోసం స్వర్గానికి ప్రయాణం.. సుశాంత్ సింగ్ పెంపుడు కుక్క మరణం..
బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ చనిపోయి రెండేళ్లు అవుతున్నా అభిమానులు మాత్రం అతనిని మర్చిపోలేక పోతున్నారు. ఇక సుశాంత్ సింగ్ పెంపుడు కుక్క.. సుశాంత్ లేడు అన్న దిగులుతో రెండేళ్ల తరువాత ఈ రోజు తెల్లవారుజామున మరణించినట్లు వెల్లడించింది సుశాంత్ సింగ్ సిస్టర్ ప్రియాంక సింగ్.
- gum 95921
- Published on- January 17, 2023 / 12:42 PM IST
Sushant Singh Rajput pet dog
Sushant Singh Rajput : బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సుశాంత్ సింగ్ రాజపుత్ చనిపోయి రెండేళ్లు అవుతున్నా అభిమానులు మాత్రం అతనిని మర్చిపోలేక పోతున్నారు. భారత క్రికెటర్ ఎం ఎస్ ధోని బయోపిక్ లో నటించి పాన్ ఇండియా వైడ్ ఆడియన్స్ కి దగ్గరయిన సుశాంత్ సింగ్.. 2020 జూన్ లో సూసైడ్ చేసుకున్నాడు. అతని మరణ వార్త విని అందరూ తీవ్ర దిగ్బ్రాంతికి లోనయ్యారు. ఇక సుశాంత్ సింగ్ పెంపుడు కుక్క.. తన యజమాని కనిపించక బాధ పడుతున్న వీడియోలు, ఫోటోలు అప్పటిలో చాలా వైరల్ అయ్యాయి.
Sushant Singh Rajput : సంచలన ప్రకటన చేసిన పోస్టుమార్టం డాక్టర్..
తాజాగా ఆ కుక్క చనిపోయిన విషయాన్ని సుశాంత్ సింగ్ సిస్టర్ ప్రియాంక సింగ్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ఈ కుక్క పేరు ఫడ్జ్. దీనితో చాలా సన్నిహితంగా ఉండేవాడు సుశాంత్ సింగ్. తనతో ఆడుతూ సరదాగా గడిపిన వీడియోలను సుశాంత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వచ్చే వాడు. ఇక సుశాంత్ మరణం తరువాత ఫడ్జ్ ఇంతకు ముందులా సరదాగా ఉండడం మానేసింది. సుశాంత్ లేడు అన్న దిగులుతో రెండేళ్ల తరువాత ఈ రోజు తెల్లవారుజామున మరణించినట్లు వెల్లడించింది ప్రియాంక సింగ్.
“నీ స్నేహితుడిని కలుసుకోడానికి నువ్వు కూడా స్వర్గానికి వెళ్లిపోయావా ఫడ్జ్. ఏదొక రోజు నిన్ను అనుసరించి మీ దగ్గరకి మేము వచ్చేస్తాం. అయితే అప్పటి వరకు మాకు మీరు లేరు అన్న బాధ తప్పదు” అంటూ ఎమోషనల్ ట్వీట్ చేస్తూ సుశాంత్ తో ఉన్న ఫడ్జ్ ఫోటోని షేర్ చేసింది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజెన్లు ఫడ్జ్ మరణం పై విచారం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇటీవల సుశాంత్ సింగ్ కి పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్.. సుశాంత్ మరణం గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. అతనిది సూసైడ్ కాదంటూ, బాడీ పై గాయాలు ఉన్నాయి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
