×
Ad

Sushmita Konidela : బాబాయ్ భయపెట్టేవాడు.. పవన్ కళ్యాణ్ పై చిరు కూతురు కామెంట్స్ వైరల్..

తాజాగా సుస్మిత ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా బాబాయ్ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర విషయాలు తెలిపింది. (Sushmita Konidela)

  • Published On : March 9, 2026 / 09:20 AM IST

Sushmita Konidela

Sushmita Konidela : చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల ఫ్యాషన్ డిజైనర్ గా సినీ పరిశ్రమలో ప్రయాణం మొదలుపెట్టి ఇప్పుడు నిర్మాతగా దూసుకుపోతుంది. సుస్మిత ఇటీవలే చిరంజీవిని హీరోగా పెట్టి మన శంకర వరప్రసాద్ గారు సినిమా తీసి భారీ విజయం సాధించింది.

తాజాగా సుస్మిత ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా బాబాయ్ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర విషయాలు తెలిపింది.

Also Read : Virosh : విజయ్ – రష్మిక పెళ్ళికి ఎన్ని కోట్లు ఖర్చు అయింది..? విజయ్ ఆడిటర్ ఏమన్నాడంటే..

సుస్మిత మాట్లాడుతూ.. ఆయన కేవలం బాబాయ్ మాత్రమే కాదు బ్రదర్ కూడా. బాబాయ్ దగ్గర హాలీవుడ్ సినిమాలు చాలా ఉండేవి. గాడ్‌ఫాదర్, స్టార్ వార్స్.. లాంటి హాలీవుడ్ సినిమాలను ఆయనే మాకు పరిచయం చేసారు. ఇంగ్లీష్ మ్యూజిక్ కూడా ఆయనే వినిపించేవాళ్ళు. చిన్నప్పుడు రాత్రి పూట బాబాయ్ నన్ను, చరణ్ ని.. ఇలా పిల్లలందర్నీ కుర్చోబెట్టుకొని హారర్ కథలు చెప్పేవాళ్ళు. నాకు హారర్ స్టోరీస్ అంటే ఇష్టం. నేను వినేదాన్ని కానీ మిగితా పిల్లలు ఆ కథలకు భయపడి వెళ్లిపోయేవాళ్లు. ఆయన డ్రెస్సింగ్ లో ఏం వేసుకున్నా ట్రెండ్ అవుతుంది. కానీ బాబాయ్ లో ఉన్న మరో కోణం ఆధ్యాత్మికత, తాత్వికత మమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి అని తెలిపింది.