Suvarna: మొబైల్ ఫోన్ మిమ్మల్ని దెయ్యంగా మారుస్తుందా? క్యూరియాసిటీ పెంచుతున్న ‘సువర్ణ’

సరికొత్త కథ, కథనంతో ప్రేక్షకుల ముందుకు రానున్న సువర్ణ(Suvarna) మూవీ.

suvarna movie release update

Suvarna: ఆరాధ్య క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన రొమాంటిక్ హారర్ కామెడీ చిత్రం “సువర్ణ(Suvarna)”. సరికొత్త కథతో అశోక్ రొయ్య స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. నేటి సమాజంలో మొబైల్ ఫోన్‌కు బానిసలవుతున్న యువత కథతో ఈ సినిమా రానుంది. మొబైల్ ఫోన్ వ్యామోహంలో పడి సువర్ణ అనే యువతి ఎలా ప్రాణాలు కోల్పోయింది? ఆమె దెయ్యంగా మారడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి? అనే ఆసక్తికర అంశాలతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు మేకర్స్.

Spirit: ‘స్పిరిట్’ స్టోరీ చాలా రొటీన్.. అసలు ఊహించలేదు.. ప్రభాస్ ఫ్యాన్స్ కి షాకిచ్చిన నిర్మాత

దర్శక నిర్మాత అశోక్ రొయ్య మాట్లాడుతూ, సినిమా చాలా వైవిధ్యంగా వచ్చిందని, ముఖ్యంగా గ్రాఫిక్స్, రీ-రికార్డింగ్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో పల్లవి, షకలక శంకర్, జగదీష్, వర్ణిక, జబర్దస్త్ రాజమౌళి, పవన్, దేవి, శివ, శ్రీహరి తదితరులు కీలక పాత్రల్లో నటించి తమ నటనతో మెప్పించారని తెలిపారు. హారర్ ఎలిమెంట్స్‌కు రొమాన్స్, కామెడీ జోడించి నిర్మించిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర బృందం భావిస్తోంది. ఏప్రిల్ 3న విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుంది అనేది చూడాలి మరి.