Spirit: ‘స్పిరిట్’ స్టోరీ చాలా రొటీన్.. అసలు ఊహించలేదు.. ప్రభాస్ ఫ్యాన్స్ కి షాకిచ్చిన నిర్మాత
ప్రభాస్ 'స్పిరిట్(Spirit)' కథపై షాకింగ్ కామెంట్స్ చేసిన నిర్మాత భూషణ్ కుమార్.
Producer Bhushan Kumar shocking comments on Spirit movie story
- సందీప్ టేకింగ్ వేరే లెవల్
- రొటీన్ కథతోనే మైండ్ బ్లాక్ చేస్తాడు
- ప్రభాస్ ‘స్పిరిట్’ పై నిర్మాత ధీమా
Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వస్తున్న ‘స్పిరిట్’ (Spirit) సినిమాపై అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ‘యానిమల్’ వంటి భారీ విజయం తర్వాత సందీప్ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో, దీనిపై అటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ, ఇటు ప్రేక్షకుల్లోనూ విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ఇంటర్నేషనల్ లెవల్లో టి-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు.
తాజాగా ఆయన ఈ సినిమా కథాంశంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. భూషణ్ కుమార్ మాట్లాడుతూ, ‘స్పిరిట్’ కథ వినడానికి చాలా రొటీన్‌గా అనిపించవచ్చు, కానీ సందీప్ రెడ్డి వంగా దానిని తెరకెక్కిస్తున్న విధానం మాత్రం మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుందని వెల్లడించారు. కథలోని ప్రతి సన్నివేశాన్ని సందీప్ తనదైన శైలిలో నెక్స్ట్ లెవల్లో సెట్ చేశారని, మేకింగ్ పరంగా ఇది ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ సినిమా ‘యానిమల్’ కంటే పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని ఆయన చెప్పారు.
ప్రభాస్ ఇందులో ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారని ఇప్పటికే వార్తలు వచ్చాయి. సందీప్ మార్క్ వయొలెన్స్‌కు ప్రభాస్ కటౌట్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సాధారణ కథను కూడా తన టేకింగ్‌తో అద్భుతంగా మార్చగల సందీప్ టాలెంట్ పై నిర్మాత చేసిన ఈ కామెంట్స్, సినిమాపై ఉన్న హైప్‌ను మరింత పెంచాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఒక రొటీన్ కథను సందీప్ ఎంత వైలెంట్‌గా, ఎంత కొత్తగా చూపిస్తారో అన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. 2027లో స్పిరిట్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.
