రీసెంట్‌గా హైదరాబాద్‌లో ‘సైరా’ సక్సెస్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేశారు. నటసింహా నందమూరి బాలకృష్ణ ఈ ఫంక్షన్‌లో సెంట్రాఫ్ అట్రాక్షన్‌గా నిలిచాడు..
సాత్వంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో, కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్‌పై, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ భారీ బడ్జెట్‌తో నిర్మించిన హిస్టారికల్ మూవీ.. ‘సైరా నరసింహారెడ్డి’.. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో ‘సైరా’ భారీగా విడుదలైంది.
సైరా మూవీ పాజిటివ్ టాక్ దక్కించుకోవడమే కాక.. భారీగా వసూళ్లు రాబడుతుంది. రీసెంట్‌గా హైదరాబాద్‌లో ‘సైరా’ సక్సెస్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేశారు. నటసింహా నందమూరి బాలకృష్ణ ఈ ఫంక్షన్‌లో సెంట్రాఫ్ అట్రాక్షన్‌గా నిలిచాడు..
Read Also : సందీప్ రెడ్డి వంగ సెకండ్ బాలీవుడ్ మూవీ..
సినిమాల మధ్య తమ మధ్య ఆరోగ్యకరమైన పోటీ మాత్రమే ఉంటుందని, సినిమా పరిశ్రమలో తాను అత్యంత సన్నిహితంగా ఉండేదీ, తనకున్న ఏకైక స్నేహితుడు చిరంజీవే అని బాలయ్య పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే. బాలయ్య ‘సైరా’ సక్సెస్ పార్టీకి అటెండ్ అయిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ కార్యక్రమంలో వెంకటేష్, కృష్ణంరాజు, అల్లు అరవింద్, గంటా శ్రీనివాసరావు, మురళీమోహన్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
#Gettogether #SyeRaaNarsimhaReddy #Hyderabad pic.twitter.com/ecZGgXZ6h5
— Ganta Srinivasa Rao (@Ganta_Srinivasa) October 10, 2019