Tamannah Bhatia
Tamannah Bhatia: ఫ్యాషన్ ఎక్కువగా ఫాలో అయ్యే హీరోయిన్లలో తమన్నా ఒకరు. తమన్నా ఏదైనా పబ్లిక్ ఈవెంట్ లేదా సినిమా ఫంక్షన్‌కు గానీ హాజరైందంటే ఆమె డ్రెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలవడం ఖాయం. ఎప్పుడూ కొత్తకొత్త.. ట్రెండీ ఔట్‌ఫిట్స్‌తో ఫ్యాషన్ ప్రియులను, ఫ్యాన్స్‌ను అట్రాక్ట్ చేస్తుంది. గత గురువారం తన కొత్త వెబ్ సిరీస్ ‘జీ కర్దా’ ప్రమోషన్స్‌లో భాగంగా తమన్నా ధరించిన డ్రెస్ కూడా ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఫ్యాషన్ ఇండస్ట్రీగా మారింది. దీనికి కారణం ఆ డ్రెస్సు ఖరీదు. తమన్నా ఈ ఈవెంట్‌కు బ్లూ కలర్ మినీ డ్రెస్‌లో హాజరైంది. ఈ డ్రెస్సులో తమన్నా మరింత ఆకర్షణీయంగా కనిపించింది. ఇది ఇటలీలోని జియాని వెర్సాస్ లగ్జరీ బ్రాండ్‌కు చెందిన డ్రెస్సు.
Tamannaah: టైట్ ఫిట్‌లో బౌండరీలు బ్రేక్ చేసిన తమ్మూ!
ఈ లెదర్ డ్రెస్సు ఖరీదు 3,525 అమెరికన్ డాలర్లు. మన కరెన్సీలో రూ.2,69,121. ఈ డ్రెస్సుతోపాటు తమన్నా టామ్ ఫోర్డ్ కంపెనీకి చెందిన హీల్స్ ధరించింది. వీటి ఖరీదు మన కరెన్సీలో రూ.90,800. వీటితోపాటు తమన్నా ధరించిన ఇయర్ రింగ్స్, జువెలరీ కూడా ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.