Tamannaah dinner night with her rumoured boy friend Vijay Varma
Tamannaah : మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం బి టౌన్ లో హాట్ టాపిక్ అయ్యిపోయింది. బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మ (Vijay Varma) తో ఈ భామ ప్రేమాయణం నడుపుతుంది అంటూ గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. దానికి తగ్గట్టు తమన్నా అండ్ విజయ్ కూడా చెట్టపట్టాలు వేసుకొని ముంబై వీధుల్లో బహిరంగం గానే తిరిగేస్తున్నారు. తాజాగా వీరిద్దరూ మరోసారి కెమెరా లెన్స్ కి చిక్కారు.
Tamannaah: విజయ్ వర్మతో డేటింగ్.. కన్ఫ్యూజ్ చేస్తూనే క్లారిటీ ఇచ్చేసిన మిల్కీ బ్యూటీ!
ముంబైలోని ఒక హోటల్ లో కలిసి డిన్నర్ చేసిన తమన్నా అండ్ విజయ్.. తిరిగి ఒకే కారులో ప్రయాణం అయ్యారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా వీరిద్దరి ప్రేమ భాగవతం ఈ ఏడాది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో బయట పడింది. గోవాలో న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించిన వీడియో ఒకటి బయటకి రాగా.. అందులో తమన్నా, విజయ్ ముందు పెట్టుకుంటూ కనిపించారు. ఇక ఆ తరువాత కూడా వీరిద్దరూ పలు బాలీవుడ్ ఫంక్షన్ లో ఒకటిగా కనిపించి సందడి చేశారు.
విజయ్ వర్మ టాలీవుడ్ కి నాని MCA సినిమాతో పరిచయం అయ్యాడు. అయితే తమన్నా, విజయ్ ల పరిచయం లస్ట్ స్టోరీస్ 2 సిరీస్ వల్ల జరిగినట్లు తెలుస్తుంది. ఈ సిరీస్ లో వీరిద్దరూ నటించబోతున్నారని సమాచారం. అయితే దీని గురించి ఎటువంటి ప్రకటన లేదు. ప్రస్తుతం తమన్నా సౌత్ రెండు బడా మూవీల్లో నటిస్తుంది. ఒకటి చిరంజీవి పక్కన భోళా శంకర్, మరొకటి రజినీకాంత్ జైలర్. ఈ రెండు చిత్రాలు పై ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. భోళా శంకర్ ని మెహర్ రమేష్ తెరకెక్కిస్తుండగా జైలర్ ని నెల్సన్ డైరెక్ట్ చేస్తున్నాడు. కాగా భళా శంకర్ తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళంకి రీమేక్.