Tamannaah Discharged: ఇటీవల కరోనా బారినపడ్డ మిల్కీబ్యూటీ తమన్నా కరోనా నుంచి కోలుకున్నారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ఆమె డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించారు. తనకు కరోనా సోకడం పై తమన్నా స్పందించారు.
‘‘నేను నాటీం సెట్ లో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా లాస్ట్ వీక్ నాకు ఫీవర్ వచ్చింది. టెస్ట్ లు చేయించుకోవడంతో నాకు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. వెంటనే హైదారాబాద్ లోని ఓ ప్రవేట్ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాను. అత్యున్నత వైద్యుల పర్యవేక్షణలో ట్రీట్ మెంట్ తీసుకున్నాను. ఇప్పుడు నేను కోలుకుని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాను. ప్రపంచంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో నేను పూర్తిగా కోలుకోవడం చాలా ఆనందంగా వుంది. ఇప్పుడు వైద్యుల సలహా మేరకు హోం ఇసోలేషన్ లో ఉన్నాను’’.. అని ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు తమన్నా.