Tamannaah said her first liplock with Vijay Varma in Lust Stories 2 promotions
Tamannaah – Vijay Varma : హీరోయిన్ తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ రిలేషన్ ఇటీవల హాట్ టాపిక్ అయ్యిపోయింది. టాలీవుడ్ టు బాలీవుడ్ వీరిద్దరి న్యూస్ రోజు వైరల్ అవుతూ వస్తుంది. అసలు ఈ వార్తలు ఎప్పుడు మొదలయ్యాయి అంటే.. ఈ ఏడాది గోవా న్యూఇయర్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఒక వీడియో బయటకి రావడం, అందులో తమన్నా అండ్ విజయ్ లిప్‌లాక్ చేసుకుంటూ కనబడడంతో ప్రేమ రూమర్లు చక్కర్లు కొట్టాయి, ఆ తరువాత వీరిద్దరూ కలిసి ముంబై వీధుల్లో షికార్లు కొడుతూ కనిపించడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరాయి.
Dimple Hayathi : రష్మిక, నిధి అగర్వాల్‌ని ఫాలో అవుతున్న డింపుల్.. ఏ విషయంలో తెలుసా..?
తాజాగా వీరిద్దరూ కలిసి లస్ట్ స్టోరీస్ 2 (Lust Stories 2) వంటి అడల్ట్ సినిమాలో కలిసి నటించడం ఇంకొంచెం ఇంటరెస్టింగ్‌ని కలిగించింది. ఇటీవలే ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కాగా దానిలో వీరిద్దరి రొమాన్స్ సీన్లు హైలైట్ గా నిలిచాయి. ప్రస్తుతం వీరిద్దరూ ఈ సినిమా ప్రమోషన్స్ లో ఉన్నారు. ఇద్దరు కలిసి పలు ఇంటర్వ్యూలు ఇస్తూ ఇంటరెస్టింగ్ విషయాలను తెలియజేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే పలు ఇంటర్వ్యూల్లో.. ఒకరికి ఒకరు కలిసి ఉంటే జీవితాంతం చాలా సంతోషంగా ఉంటాము అంటూ సంచలన కామెంట్స్ చేస్తున్నారు.
Sai Dharam Tej : రామ్‌చరణ్ దర్శకుడితో సాయి ధరమ్ తేజ్ సినిమా.. నిజమేనా..?
ఇక తాజా ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ.. “ఇన్నాళ్ల నా కెరీర్ లో లిప్‌లాక్ సీన్స్ కి నో చెబుతూ వచ్చాను. కానీ మొదటిసారి ఈ సినిమాలో లిప్‌లాక్ సీన్ చేశాను. ఆన్ స్క్రీన్ లో నేను లిప్‌లాక్ ఇచ్చిన మొదటి వ్యక్తి విజయ్‌నే” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ మాటలకు విజయ్ రియాక్ట్ అవుతూ.. “నాతో మొదటి ముద్దు అని చెప్పినందుకు థాంక్యూ” అంటూ వ్యాఖ్యానించాడు. ఇక ఈ వ్యాఖ్యలు విన్న ఆడియన్స్.. విజయ్ తో ప్రేమలో ఉంది కాబట్టే తమన్నా తన నో కిస్సింగ్ పాలసీని బ్రేక్ చేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.