Tamannaah : నేను ఏ యాక్టర్ దగ్గర సేఫ్‌గా ఫీల్ అవ్వలేదు.. కానీ విజయ్ వర్మ దగ్గర.. తమన్నా!

తమన్నా, విజయ్ వర్మల జంట బి-టౌన్ లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ..

Tamannaah said Vijay Varma makes her safe in shooting times

Tamannaah – Vijay Varma : బాలీవుడ్ లో తమన్నా అండ్ విజయ్ వర్మ కపుల్ హాట్ టాపిక్ అయ్యిపోయారు. ముందుగా వీరిద్దరి ప్రేమ రూమర్లు చక్కర్లు కొట్టడం, ఆ తరువాత వీరిద్దరూ కలిసి ముంబై వీధుల్లో షికార్లు కొట్టడంతో బాగా ట్రెండ్ అయ్యారు. ఇక తాజాగా వీరిద్దరూ కలిసి లస్ట్ స్టోరీస్ 2 (Lust Stories 2) వంటి అడల్ట్ సినిమాలో నటించడం ఇంకా ఇంటరెస్టింగ్‌ని కలిగించింది. దీంతో ఈ మూవీలో ఎంతమంది స్టార్ క్యాస్ట్ ఉన్నాసరి ఆడియన్స్ చూపు అంతా తమన్నా అండ్ విజయ్ మీదనే ఉంది.

Ravi Teja : రవితేజ నిర్మాణంలో సుందరం మాస్టర్ సినిమా.. 1930 కాదు 2023..!

ఇక ఇటీవల ట్రైలర్ కూడా రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ వీరిద్దరి రొమాన్స్ సీన్స్ అందర్నీ దృష్టిని ఆకర్షించాయి. జూన్ 29న డైరెక్ట్ ఓటీటీలో (Netflix) రిలీజ్ కాబోతుంది. దీంతో ఈ మూవీ ప్రమోషన్ లో ఉన్న విజయ్ అండ్ తమన్నా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో తమన్నా మాట్లాడుతూ.. “నేను ఏ యాక్టర్ దగ్గర సేఫ్‌గా ఉన్నట్లు ఫీల్ అవ్వలేదు. కానీ విజయ్ దగ్గర నేను అలా ఫీల్ అయ్యాను. ముఖ్యంగా ఇలాంటి సినిమాలో నటించేటప్పుడు.. ఒక యాక్టర్ కి కంఫర్ట్ అనేది కావాలి. నేను ఏదైనా చెప్పడానికి, చేయడానికి లేదా ఒక డిఫరెంట్ వేలో నేను ఎమోషన్ ని ఎమోట్ చేయడానికి భయపడకుండా ఉండాలంటే సేఫ్ అనే ఫీలింగ్ నాకు కలగాలి” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.

Lust Stories 2 Trailer : లస్ట్ స్టోరీస్ 2 ట్రైలర్ రిలీజ్.. తమన్నా, విజయ్ వర్మ రొమాన్స్!

కాగా ఈ సినిమాలో వీరిద్దరితో పాటు మృణాల్ ఠాకూర్, కాజోల్, నీనా గుప్తా, అమృత సుభాష్, అంగద్ బేడీ.. వంటి తారలు కూడా మెరవబోతున్నారు. ఈ సినిమాని అమిత్ రవీంద్రనాథ్ శర్మ, కొంకణా సేన్ శర్మ, R బాల్కి, సుజోయ్ ఘోష్ లు డైరెక్ట్ చేశారు. సినిమాలో మొత్తం నాలుగు సిగ్మెంట్స్ ఉండగా.. ఒకొక సిగ్మెంట్ ని ఒకొక డైరెక్టర్ చిత్రీకరించారు.