Tamannaah : బాలకృష్ణ అంటే నాకు ఎంతో గౌరవం.. తప్పు వార్తలు రాయకండి.. తమన్నా సీరియస్ ట్వీట్!
బాలకృష్ణ, అనిల్ రావిపూడి కలయికలో వస్తున్న NBK108 సినిమాలో తమన్నా సాంగ్ గురించి వస్తున్న వార్తల పై సీరియస్ ట్వీట్ చేసిన మిల్కీ బ్యూటీ.
- gum 95921
- Published on- May 20, 2023 / 07:25 PM IST
Tamannaah serious tweet on Balakrishna NBK108 movie
Balakrishna : నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం NBK108 సినిమాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) బాలకృష్ణకి జోడిగా నటిస్తుండగా.. మరో హీరోయిన్ శ్రీలీల (Sreeleela) ఒక ముఖ్య పాత్రలో కనిపించబోతుంది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఉందట. ఆ సాంగ్ ని మిల్కీ బ్యూటీ తమన్నాతో (Tamannaah) వేయించాలని దర్శకుడు అనిల్ రావిపూడి భావించాడట. గతంలో ఈ డైరెక్టర్ తెరకెక్కించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో కూడా మహేష్ బాబుతో కలిసి తమన్నా చిందులేసిన విషయం తెలిసిందే.
NTR : ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు జూ. ఎన్టీఆర్ దూరం
అంతేకాదు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన F2, F3 చిత్రాల్లో కూడా హీరోయిన్ గా నటించింది. దీంతో ఆ దర్శకుడితో మంచి అనుబంధం ఉంది. ఇక తమన్నా ఈ సినిమాలో సాంగ్ కచ్చితంగా చేస్తుందని అందరు అనుకున్నారు. కానీ తమన్నా దాదాపు కోటిన్నర రెమ్యూనిరేషన్ అడిగి ఆ సినిమా నుంచి తప్పుకుందంటూ పలు మీడియా వెబ్ సైట్స్ లో కథనాలు రాసుకొచ్చారు. తాజాగా వీటి పై తమన్నా రియాక్ట్ అయ్యింది.
“అనిల్ రావిపూడితో కలిసి వర్క్ చేయడాన్ని నేను ఎంతో ఎంజాయ్ చేస్తాను. ఆయన అన్న, నందమూరి బాలకృష్ణ సర్ అన్న నాకెంతో గౌరవం. అలాంటిది ఎటువంటి ఆధారం లేకుండా NBK108 లోని సాంగ్ గురించి రాస్తున్న ఆర్టికల్స్ చూస్తుంటే చాలా బాధగా ఉంది. ఇలాంటివి రాసే ముందు కొంచెం రీసెర్చ్ చేసి రాస్తే బెటర్” అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది.
