స్వయంవరం, పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన మిల్కీ బ్యూటీ తమన్నా..
మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లికి రెడీ అవుతుందనే మాట గతకొద్ది రోజులుగా వినిపిస్తుంది. 2005లో ‘చాంద్ సా రోషన్ చెహ్రా’ అనే హిందీ సినిమాతో తెరంగేట్రం చేసిన తమన్నా విజయవంతంగా పదిహేనేళ్ల సినీ కెరీర్ పూర్తి చేసుకుంది. ఇతర హీరోయిన్ల నుండి పోటీ కారణంగా అవకాశాలు తగ్గడంతో కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పెట్టి, పెళ్లి పీటలెక్కానుకుంటుందని సమాచారం. తమన్నా పెళ్లి గురించి ఇటీవల ఆమె తల్లి తమన్నాకు సంబంధాలు చూస్తున్నామని వెల్లడించారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన తమన్నా తన పెళ్లి గురించి మాట్లాడింది. మంచి అబ్బాయి దొరికితే వెంటనే మూడు ముళ్లు వేయించుకుంటానని చెప్పింది. ఇదే అదనుగా భావించి.. ‘ఒకవేళ మీకు స్వయంవరం పెడితే.. దానికి ఏ హీరోలు రావాలని కోరుకుంటారు?’ అని తమన్నాను ప్రశ్నించారు. తమన్నా ఏమాత్రం ఆలోచించకుండా.. ‘ప్రభాస్, హృతిక్ రోషన్, విక్కీ కౌశల్’.. వీళ్ల ముగ్గురు పేర్లు చెప్పింది.
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్‌కు తమన్నా వీరాభిమాని.. ఆన్ స్క్రీన్‌పై హృతిక్‌తో రొమాన్స్ చేయాల్సి వస్తే అయితే తన నో-కిస్ ఒప్పందాన్ని పక్కన పెడతానని చెప్పింది. ఇక, ప్రభాస్‌తో ‘రెబల్’, ‘బాహుబలి’ సినిమాల్లో నటించింది తమన్నా. ఎలాగూ అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది కాబట్టి.. పెళ్లైపోయింది అనుకునే వరకు తమన్నా గురించి సోషల్ మీడియాలో ఎన్ని పుకార్లు షికార్లు చేస్తాయో చూడాలి మరి.