Arjun Das: రహస్యంగా ఎంగేజ్మెంట్.. పెళ్లిచేసుకోబోతున్న అర్జున్ దాస్
తమిళ నటుడు అర్జున్ దాస్ (Arjun Das)పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
- V Santhosh Kumar
- Published on- May 29, 2026 / 11:01 AM IST
Tamil actor Arjun Das got secretly engaged.
- అర్జున్ దాస్ పెళ్లి వార్తలపై క్లారిటీ
- రహస్య నిశ్చితార్థం రూమర్ల తీవ్ర ఖండన
- నిజం లేదన్న నటుడి అధికారిక బృందం
Arjun Das: విలక్షణమైన నటన, గంభీరమైన వాయిస్‌తో సౌత్ ఇండియాలో మంచి క్రేజ్ సంపాదించుకున్న నటుడు అర్జున్ దాస్. ఖైదీ, మాస్టర్, గుడ్ బ్యాడ్ అగ్లీ, తెలుగులో ‘ఓజీ’ వంటి చిత్రాలతో మెప్పించిన ఈయన, త్వరలోనే ‘కాన్ సిటీ’ చిత్రంతో హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే, తాజాగా అర్జున్ దాస్ రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారని, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ కోలీవుడ్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది.
Shankar: పాపం.. శంకర్ పై నమ్మకం లేదా.. విక్రమ్ ‘వేల్పరి’ కూడా క్యాన్సిల్
గతంలో హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మితో రిలేషన్ రూమర్లను ఖండించిన ఈ నటుడి పెళ్లి వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.ఈ పుకార్లపై అర్జున్ దాస్ (Arjun Das)టీమ్ తాజాగా స్పందించి క్లారిటీ ఇచ్చింది. ఆయన నిశ్చితార్థం, వివాహం గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి వ్యక్తిగత విషయాలపై కథనాలు రాసే ముందు నిజా నిజాలు తెలుసుకోవాలని మీడియా వర్గాలను కోరింది. దీంతో ఈ సీక్రెట్ ఎంగేజ్‌మెంట్ ప్రచారానికి బ్రేక్ పడినట్లయింది.
