Tamil Actor Florent Pereira Passes away: కోవిడ్ కారణంగా ప్రపంచమంతా గతకొంత కాలంగా అతలాకుతలమవుతోంది.. జనజీవనం కొన్నాళ్ల పాటు స్తంభించిపోయింది. పలు రంగాలపై కోవిడ్ చాలా ప్రభావం చూపించింది. ముఖ్యంగా కోవిడ్ వల్ల ప్రత్యక్షంగా ఇబ్బందిపడ్డ పరిశ్రమల్లో సినీ పరిశ్రమ ఒకటి. కోవిడ్ కారణంగా సినీ పరిశ్రమలోని ప్రముఖులు ఇబ్బందులు పడ్డారు. కొందరు కోవిడ్ మహమ్మారి నుండి బయటపడితే.. కొందరు కన్నుమూశారు.
https://10tv.in/actress-sanjjanaa-galrani-ragini-dwivedi-revealed-news-heroine-names-in-kannada-drug-case/
ఇప్పుడు కోవిడ్ కారణంగా కోలీవుడ్‌కి చెందిన ప్రముఖ నటుడు ఫ్లోరెంట్ సి.పెరేరియా(67) సోమవారం సాయంత్రం చెన్నైలోని రాజీవ్‌గాంధీ జనరల్ హాస్పిటల్‌లో కన్నుమూశారు. ‘విఐపి 2’, ‘రైల్’(ధనుష్ హీరో) సహా ఎన్నో చిత్రాల్లో పెరేరియా కీలకపాత్రల్లో నటించారు. నటుడిగానే కాదు.. కలైంగర్ టీవీ ఛానెల్‌కు మేనేజర్‌గానూ ఆయన వ్యవహరించారు.
పెరేరియా కోవిడ్ లక్షణాలతో రెండు వారాల క్రితం ఆసుపత్రిలో చేరారు. కాగా గతవారం ఆరోగ్యం బాగా క్షీణించడంతో కన్నుమూశారు. ఫ్లోరెంట్ సి.పెరేరియా మృతిపట్ల యావత్ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఫ్లోరెంట్ సి.పెరేరియా మృతిపై సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు..