Thennarasu Suicide: సినిమా పరిశ్రమలో వరుస మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా తమిళ యువ నటుడు తెన్నారసు ఆత్మహత్య చేసుకున్నారు. చెన్నైలోని మైలాపూర్‌లో మంగళవారం తన నివాసంలో ఫ్యానుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నారు.
భార్యతో ఘర్షణకు దిగిన అనంతరం తీవ్ర మనస్తాపానికి లోనై అతడు బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కాగా మూడేళ్ల క్రితం తెన్నారసు తను ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ ఓ బిడ్డ కూడా ఉంది.
మద్యానికి బానిసైన తెన్నారసు భార్యతో తరచూ గొడవపడేవారని స్థానికులు చెప్తున్నారు. ఇదిలా వుండగా తెన్నారసు హీరో శివకార్తికేయన్ నటించిన ‘మెరీనా’ చిత్రంలో నటించారు. ఈ సినిమాలో తను పోషించిన హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అతనికి మంచి పేరు తెచ్చిపెట్టింది. తెలుగులో ‘మెరీనా- ది బీచ్’ పేరుతో యూట్యూబ్‌లో ఉందీ చిత్రం. పలు తమిళ చిత్రాల్లో హీరో స్నేహితుడి పాత్రల్లో ఆకట్టుకున్నారు తెన్నారసు.