తమిళ హీరో శరత్ కుమార్ కు కరోనా పాజిటివ్

  • Publish Date - December 8, 2020 / 06:04 PM IST

tamil hero sharat kumar tested positive for corona : కరోనా వైరస్ వ్యాధి సోకటం మొదలై ఏడాది గడుస్తున్నా ఇంకా పాజిటివ్ కేసులు వస్తూనే ఉన్నాయి. మరో వైపు వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ చివరి దశలో ఉన్నాయి. క్రమేపీ రికవరీ రేటు పెరిగింది. మరణాల సంఖ్య తగ్గింది. సాధారణ ప్రజలతో పాటు సెలబ్రిటీలుకూడా కరోనా బారిన పడి పలువురు ప్రముఖులు కన్నుమూయగా … మరి కొందరు క్షేమంగా కొలుకున్నారు. తాజాగా ప్రముఖ తమిళ హీరో శరత్ కుమార్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.



ఈ విషయాన్ని ఆయన భార్య రాధిక ట్విట్టర్ ద్వారా తెలియ చేశారు. ఈరోజు “శరత్ కి కరోనా వైరస్ పాజిటివ్ అని తేలింది అయితే ఆయనకు ఎటువంటి లక్షణాలూ కనిపించలేదు కానీ ముందు జాగ్రత్తగా ఆయన మంచి డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు వివరాలు అందిస్తా అని పేర్కొంటూ ట్వీట్ చేసింది.



ఇదే విషయాన్ని ఆయన కుమార్తె ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ప్రకటించారు. తన తండ్రి శరత్ కుమార్ కి కరోనా వైరస్ ఉందని ఆయన ప్రస్తుతం హైదరాబాదులో ఉన్నారని ఆయన ప్రస్తుతం డాక్టరు పర్యవేక్షణలో కోలుకుంటున్నారని ఆమె పేర్కొంది. ప్రస్తుతం శరత్ కుమార్ మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ‘పొన్నియిన్ సెల్వన్‌’లో కీలక పాత్ర పోషిస్తున్నారు.