Pawan kalyan – Vijay : పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలిపిన తమిళ్ స్టార్ హీరో విజయ్.. పవన్ లాగే విజయ్ కూడా..

తమిళ్ స్టార్ హీరో, తమిళ వెట్రి కజగం పార్టీ అధినేత విజయ్ కూడా పవన్ కళ్యాణ్ కు, చంద్రబాబు నాయుడుకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేసారు.

Pawan kalyan – Vijay : ఏపీ ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించింది. జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ విజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురం నుంచి భారీ మెజారితో గెలుపొందారు. దీంతో పవన్ కు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Also Read : Akira Nandan : నాన్న గెలుపుపై సోషల్ మీడియాలో పవన్ తనయుడు అకిరా స్పెషల్ పోస్ట్.. ఏం పెట్టాడంటే..

తమిళ్ స్టార్ హీరో, తమిళ వెట్రి కజగం పార్టీ అధినేత విజయ్ కూడా పవన్ కళ్యాణ్ కు, చంద్రబాబు నాయుడుకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేసారు. విజయ్ తన పర్సనల్ అకౌంట్ నుంచి కాకుండా పార్టీ సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఈ ట్వీట్ చేసారు. ట్వీట్ లో.. భారీ విజయం సాధించి, జనసేన పార్టీని ఏపీలో రెండో అతిపెద్ద పార్టీగా నిలిపినందుకు పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు. ప్రజలకు సేవ చేసేందుకు మీ ఓర్పు, అంకితభావం అభినందనీయం అంటూ పోస్ట్ చేసాడు. అలాగే చంద్రబాబుని కూడా అభినందిస్తూ.. ఏపీ ఎన్నికల్లో భారీ విజయం సాధించినందుకు చంద్రబాబు గారికి అభినందనలు. మీ లీడర్ షిప్ లో ఏపీ అభివృద్ధి అవుతుందని ఆశిస్తున్నాను అని పోస్ట్ చేసారు.

విజయ్ కూడా ఇక్కడ పవన్ లాగే తమిళ్ లో స్టార్ హీరో. మంచి ఫ్యాన్ బేస్ ఉన్న హీరో. ప్రజలకు సేవ చేయడానికి ముందు ఉంటాడు. గతంలో తన స్వచ్ఛంద సేవ సంస్థ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన విజయ్ ఇటీవలే తమిళ వెట్రి కజగం అనే పార్టీని స్థాపించాడు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ తన పార్టీ తరపున అభ్యర్థుల్ని పోటీ చేయించనున్నారు. ఇక్కడ పవన్ విజయం విజయ్ కి కూడా ఒక పాజిటివ్ వైబ్ ఇచ్చింది. మరి పవన్ లాగే విజయ్ కూడా రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తాడా చూడాలి.

ట్రెండింగ్ వార్తలు