Tamil Star
Tamil Star : అల్లు అర్జున్ పుష్ప 2 సూపర్ హిట్ తర్వాత అట్లీతో భారీ పాన్ ఇండియా సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. హాలీవుడ్ రేంజ్ లో వారియర్, టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో ఈ సినిమా ఉంటుందని టాక్. ఆల్మోస్ట్ 800 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు పనిచేస్తున్నారు.(Tamil Star)
ఇటీవలే అల్లు అర్జున్ అట్లీ సినిమా వర్క్ షాప్ ముంబైలో జరిగింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న దీపికా పదుకోన్ కూడా డేట్స్ ఇవ్వడంతో నవంబర్ మొదటి వారం నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని సమాచారం. తాజాగా ఈ సినిమాలో ఓ తమిళ్ స్టార్ నటిస్తాడని తెలుస్తుంది.
Also Read : Udayabhanu : అల్లు అర్జున్ తో చేసి.. పవన్ కళ్యాణ్ సినిమాని రిజెక్ట్ చేసిన ఉదయభాను.. ఎందుకంటే..?
తమిళ మీడియా సమాచారం ప్రకారం.. అల్లు అర్జున్ అట్లీ సినిమాలో తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి నటించబోతున్నాడని తెలుస్తుంది. అయితే విజయ్ సేతుపతి విలన్ గానా లేక ఏదైనా కీలక పాత్రలోనా అనేది తెలియాల్సి ఉంది. గతంలో విజయ్ సేతుపతి అట్లీ జవాన్ సినిమాలో విలన్ గా నటించి బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అట్లీ అడిగితే విజయ్ సేతుపతి వెంటనే ఒప్పుకుంటాడు. ఆ బాండింగ్ తోనే విజయ్ సేతుపతి అట్లీ అల్లు అర్జున్ సినిమాలో చేస్తున్నాడని తెలుస్తుంది.
అలాగే ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, జాన్వీ కపూర్ లు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారని సమాచారం. 2027లో ఈ సినిమా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.
Also See : Varsha Bollamma : వర్ష బొల్లమ్మ కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ వర్కింగ్ స్టిల్స్..